టీఎస్ టెట్–2022 కు దరఖాస్తు చేసుకున్నఅభ్యర్థుల ఫైనల్ లిస్ట్ రెడీ అయింది. జిల్లాల వారీగా ఫైనల్ లిస్టును అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఏప్రిల్ 12న దరఖాస్తు గడువు ముగియడంతో ఆరోజు సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన లిస్టులో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగింది. ఏప్రిల్ 12న మొత్తం 3,79,101 అభ్యర్థులు పేపర్–1, పేపర్–2కు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం విడుదల చేసిన లిస్టు ప్రకారం 3,80,589 మంది అభ్యర్థులు అప్లై చేశారు.
దరఖాస్తు చివరి తేదీ వరకు 27 జిల్లాలో ఎగ్జామ్ సెంటర్లు క్లోజ్ చేయడంతో కేవలం 5 జిల్లాల్లో మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కలిగింది. దీంతో ఆ ఐదు జిల్లాల్లో మాత్రమే దరఖాస్తు సంఖ్య పెరిగింది. జగిత్యాల జిల్లాలో 10,507 నల్గొండలో 25,011, రాజన్నసిరిసిల్లలో 7,544, రంగారెడ్డిలో 23,616, సిద్దిపేటలో 10,765, సూర్యాపేటలో 15,127 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 1488 మంది అభ్యర్థులు చివరి రోజు దరఖాస్తు చేసుకున్నారు. అయితే టెట్ దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో పలువురు అభ్యర్థులు ఆందోళనకు గురై చివరి రోజు మళ్లీ దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
DISTRICTWISE FINAL APPLICATIONS
- ఆదిలాబాద్ –8000
- భద్రాద్రి కొత్తగూడెం–10,080
- హన్మకొండ–15000
- హైదరాబాద్–30,000
- జయశంకర్ భూపాలపల్లి–2,160
- జనగాం–7,200
- జోగులాంబ గద్వాల–8,160
- కామారెడ్డి–5,760
- కరీంనగర్–18,720
- ఖమ్మం–19,920
- కొమరంభీం ఆసీఫాబాద్–5,040
- మహబూబాబాద్–6,720
- మహబూబ్నగర్–20,160
- మంచిర్యాల–12,000
- మెదక్–9,360
- మేడ్చల్–7,500
- ములుగు–1,920
- నాగర్కర్నూల్–12,000
- నారాయణపేట–6,240
- నిర్మల్–8,160
- నిజామాబాద్–17,760
- పెద్దపల్లి–5,280
- సంగారెడ్డి–18,000
- వికారాబాద్–6,000
- వనపర్తి–9,600
- వరంగల్–9,120
- యాదాద్రి భువనగిరి–8,160
- జగిత్యాల–10,507
- నల్గొండలో– 25,011
- రాజన్నసిరిసిల్ల–7,544
- రంగారెడ్డి–23,616
- సిద్దిపేట–10,765
- సూర్యాపేట–15,127
Plz edit options
Super
Sir 2 day podiginchandi apply cheyani vallu chala mandhi vunaruu
Edit option isthamani ivvakunda em chesthunnaru
Please mam give us just 2 days time mam please