సెప్టెంబర్ 15 టెట్ పరీక్ష రాయనున్న అభ్యర్థులందరికీ అల్ ది బెస్ట్.
రెండు నెలలు ఎంతో కష్టపడి ప్రిపరేషన్ కొనసాగించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వెలువడింది. దీంతో మీ అందరికీ టెట్ ఎగ్జామ్ సెమీఫైనల్ లాంటిది. అందుకే ఇప్పటివరకు చేసిన ప్రిపరేషన్ తో పాటు పరీక్ష హాలులోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఇన్ని రోజులు పడ్డ కష్టం వృథా అవుతుంది కాబట్టి ఈ కింది సూచనలు తప్పకుండా పాటించండి.
- టెట్ అభ్యర్థులకు పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించరు కాబట్టి ఎగ్జామ్ సెంటర్‌కు సకాలంలో చేరుకోవాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు ముందుగానే సెంటర్ లోకేషన్ మిత్రుల ద్వారా లేదా నేరుగా వెళ్లి తెలుసుకోవాలి.
- పరీక్షా హాలులోకి సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికాలను అనుమతించరు కాబట్టి అవేమీ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి.
- పరీక్షా కేంద్రంలోకి అరగంట ముందే అనుమతిస్తారు. ఈ సమయంలో మీ వెంట తెచ్చుకున్న హాల్‌టికెట్‌లో ఏవైనా తప్పులు గమనిస్తే వాటిని మరో జిరాక్స్కాపీపై గుర్తించి ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలి.
- ప్రశ్నాపత్రం తీసుకోగానే ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పేపర్ మొదటి పేజీలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదివి పరీక్ష రాయడం ప్రారంభించాలి. మీ హాల్‌టికెట్‌ను నంబర్‌ను తప్పకుండా వేయాలి.
- మీరు పరీక్షకు హాజరైనట్టుగా ఎగ్జామ్ హాల్లో సంతకాలు తీసుకుంటారు అందులో మీకు ఇచ్చిన బుక్లెట్ కోడ్‌ను సరిచూసుకుని సంతకం చేయాలి.
- ఓఎంఆర్ షీట్‌ను ఫోల్డ్ చేయకూడదు. అలాగే ఎలాంటి తడి గానీ ఇంక్ మరకలు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి.
- బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తమ వద్ద ఎక్స్ట్రా పెన్ను ఉంచుకోవాలి. బబ్లింగ్ రౌండ్‌గా ఎలాంటి గ్యాప్ లేకుండా చేయాలి. పూర్తిగా చేస్తేనే కంప్యూటర్ ఓఎంఆర్ షీట్‌ను ఎవాల్యేట్ చేస్తుంది.
- ఓఎంఆర్ షీట్‌పై ముందుగా మీకు ఇచ్చిన ప్రశ్నాపత్రం బుక్లెట్ కోడ్‌ను బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు తప్పుగా గుర్తించడం లేదా మరిచిపోయినట్టయితే మీ ఫలితాలను విత్ హెల్డ్‌లో పెడతారు. గతంలో నిర్వహించిన టెట్‌లో సుమారు 4వేల మంది ఇలాంటి తప్పిదాలు చేయడం వల్ల వారి ఫలితాలను ఇప్పటి వరకు ప్రకటించలేదు.
- క్వశ్చన్ పేపర్లో ఏవైనా తప్పులుంటే అది మీకు సంబంధం లేని అంశం.. కీ పేపర్ వచ్చిన తర్వాత అభ్యంతరాలు స్వీకరిస్తారు. అప్పుడు మీ అభిప్రాయాలను టెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. కానీ ఎగ్జామ్ సెంటర్లో మీ సమయాన్ని వృథా చేసుకుని వాటిపై ఇన్విజిలేటర్‌తో చర్చ చేయవద్దు.
- క్వశ్చన్ పేపర్లో మీకు తెలిసిన ప్రశ్నలను ముందుగా చేయడం ద్వారా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి మీకు తెలిసిన సబ్జెక్ట్‌ను ముందుగా చేయాలి. తెలియని వాటిని చివరిలో చేయండి.
- మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేసేందుకు క్వశ్చన్ పేపర్ వెనకాల ఉన్న వైట్షీట్ను ఉపయోగించుకోవాలి. క్వశ్చన్ పేపర్‌పై ఎలాంటి పిచ్చి గీతలు, లెక్కలు చేయకూడదు.
- మొత్తం 150 ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు నిమిషం చొప్పున 150 నిమిషాల సమయం ఉంటుంది. అభ్యర్థులు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వేగంగా, కచ్చితంగా జవాబులు గుర్తించాలి. పక్కనున్న వారితో డిస్కషన్స్ చేయడం వల్ల మీ విలువైన సమయాన్ని కోల్పోతారు.
- పరీక్షా సమయం పూర్తయేంత వరకు మీ ఓఎంఆర్‌షీట్‌ను ఇవ్వకూడదు. ఒకవేళ ముందుగానే మీ పరీక్ష రాయడం అయిపోతే ఒకసారి పున:పరిశీలించుకోవాలి. ఏవైన ప్రశ్నలు చేయడం మర్చిపోయామా? అనేది గమనించాలి. ఓఎంఆర్‌షీట్‌లో ప్రతి ప్రశ్నకు బబ్లింగ్ చేసి ఉండాలి. ఖాళీగా వదిలేయకూడదు.
- డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది కాబట్టి టెట్ మార్కులు ఎంతో కీలకం. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షా హాలులో జాగ్రత్తగా ఉండాలి. ఆల్ ది బెస్ట్..
Please give my result