టీఎస్ టెట్–2022లో ఎవరూ ఊహించనంతగా సుమారు 6లక్షల అప్లికేషన్లు వచ్చాయి. 33 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసినా.. దరఖాస్తులు భారీగా రావడంతో చాలా చోట్లా సెంటర్లు నిండిపోయి వెబ్సైట్ నుంచి తొలగించారు. అయితే ఈ 6లక్షల అప్లికేషన్లలో అసలైన అభ్యర్థులు ఎంత మంది? అందులో డీఈడీ అభ్యర్థులెందరు? బీఈడీ వారెందరు? కేవలం పేపర్–1, పేపర్–2 కు మాత్రమే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ఎంత? వీటన్నింటిపై క్లారిటీ ఇస్తూ విద్యాశాఖ అధికారులు అప్లికేషన్లు, అభ్యర్థుల లిస్టు విడుదల చేశారు.
టీఎస్ టెట్ దరఖాస్తు ఫీజు గడువు బుధవారం సోమవారం ముగియడంతో పేపర్–1, పేపర్–2 రెండింటికి కలిపి 6లక్షల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో అసలైన అభ్యర్థులు 3లక్షల 65వేల మంది మాత్రమేనని అధికారులు లెక్క తేల్చారు. డీఈడీ చేసిన వాళ్లు సుమారు లక్ష మంది, బీఈడీ అభ్యర్థులు 2లక్షల 65వేల మంది ఉంటారని అంచనా వేసింది.
బీఈడీ అభ్యర్థులకు పేపర్–1కు అవకాశం ఇవ్వడం, అప్లికేషన్లో తప్పులు చేసినవారు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో రెండు సార్లు అప్లై చేయడం, సెంటర్ల అనుకూలతను బట్టి కొందరు రెండు సెంటర్లలో దరఖాస్తు చేసుకోవడం ఇలా పలు కారణాల రీత్యా దరఖాస్తులు సంఖ్య భారీగా పెరిగింది. అధికారులు ఊహించినదానికంటే ఎక్కువ దరఖాస్తులు రావడంతో మొత్తం 33 జిల్లాలకు గాను 27 జిల్లాల్లో సెంటర్లు బ్లాక్ చేశారు. చివరి వరకు జగిత్యాల, జనగామా, కరీంనగర్,నల్గొండ, ,రాజన్నసిరిసిల్ల, సూర్యపేట జిల్లాల్లోనే పరీక్ష సెంటర్లు వెబ్సైట్లో కనిపించాయి. చివరి రోజు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వీటిల్లో ఏదో ఒక జిల్లాను ఎంపిక చేసుకోక తప్పనిపరిస్థితి ఎదురైంది. ఇదిలా ఉంటే టెట్ దరఖాస్తుకు కేవలం 16 రోజులే సమయం ఇచ్చినందున మరో వారం రోజులు గడువు పొడిగించాలని, ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వాలని అభ్యర్థుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఫీజు చెల్లించిన వారికి ఈ రోజు వరకు అప్లికేషన్ సబ్మిషన్ చేసుకునేందుకు అవకాశం ఉంది.
టెట్ అప్లికేషన్లు
పేపర్–1 3,38,128
పేపర్–2 2,65,907
మొత్తం 6,04,035
అభ్యర్థుల వివరాలు
పేపర్–1 99,241
పేపర్–2 27,020
పేపర్1&2 2,38,887
మొత్తం 3,65,148
Good