తెలంగాణ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అదే నెల 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనుంది. రేపటి నుంచి ఈ నెల 20 వరకు అభ్యర్థుల నుంచి అప్లికేషన్లను స్వీకరించనుంది. టీచర్ పోస్టులకు అర్హత కోసం నిర్వహించే టెట్ పరీక్షను ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తుంది. ఈ ఏడాది మే నెలలోనే మొదటి టెట్ పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు 2024 సంవత్సరపు రెండో టెట్ నోటిపికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ మోడ్ లో 20 రోజుల పాటు టెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
Tq