ఇప్పటికే సబ్ ఇంజనీర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్ఎస్పీడీసీఎల్ (TSSPDCL) తాజాగా సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యుత్ శాఖలొ 1000 జూనియర్ లైన్‌మెన్, 201 సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ చేయనుంది.
జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు మే 19 నుంచి దరఖాస్తులు స్వీకరించనుండగా.. జూన్ 17న రాత పరీక్ష నిర్వహిస్తారు.
సబ్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 15 నుంచి దరఖాస్తులు స్వీకరించి.. జూలై 31న రాత పరీక్ష నిర్వహిస్తారు.
నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి.
దరఖాస్తుదారులు రూ.200 ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు, రూ.120 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయించారు.
జూనియర్ లైన్‌మెన్: పదో తరగతితోపాటు ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్‌మెన్ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్ లో ఇంటర్ ఒకేషనల్ కోర్సు పాసై ఉండాలి. 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. మే 19 నుంచి అప్లికేషన్స్ ప్రారంభం అవుతాయి. జూన్ 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 1000 పోస్టులకు జూలై 17వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు.
సబ్ ఇంజినీర్: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉండాలి. 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. జూన్ 15 నుంచి జులై 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 201 పోస్టులకు జులై 31న పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.tssouthernpower.cgg.gov.in వెబ్సైట్ సంప్రదించవచ్చు.
Hello gudoftrnoon sir