HomeLATESTఏఈ, ఎస్ఈ, లైన్‌మెన్ జాబ్స్.. అప్లికేషన్లు, ప్రిపరేషన్ ప్లాన్
ఏఈ, ఎస్ఈ, లైన్‌మెన్ జాబ్స్.. అప్లికేషన్లు, ప్రిపరేషన్ ప్లాన్
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)1271 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 1,000 జూనియర్ లైన్‌మెన్, 201 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 70 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులున్నాయి. ఏఈ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 3 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్ఈ, లైన్‌మెన్ పోస్టుల అప్లికేషన్లు ఇంకా మొదలు కాలేదు. త్వరలో ఈ వివరాలు వెబ్‌సైట్ లో వెల్లడించనున్నారు.
కొత్త జోనల్ విధానం ప్రకారం జేఎల్‌ఎం, సబ్ ఇంజినీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జేఎల్‌ఎం, సబ్ ఇంజనీర్ పోస్టులను జిల్లా స్థాయి పోస్టులుగా వర్గీకరించి భర్తీ చేయనున్నారు. దీంతో ఆయా జిల్లాల స్థానికత గల అభ్యర్థులకే 95 శాతం పోస్టులు దక్కనున్నాయి. రిటెన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. 95 శాతం ఉద్యోగాలు స్థానిక జిల్లా అభ్యర్థులకే కేటాయించారు. చాలా ఏళ్ల తర్వాత ఇన్ని పోస్టులకు నోటిఫకేషన్ రావడంతో తీవ్ర పోటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలు, పరీక్షా విధానం, సిలబస్, టిప్స్ మీకోసం.
అప్లికేషన్ ప్రాసెస్:
మే 12 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఈ పోస్టులకు జూలై 17న రాత పరీక్ష జరగనుంది. జులై 11 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 70 పోస్టుల్లో 16 పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఇవి కాక ఓపెన్ కేటగిరీలో మరో 9 పోస్టులు మహిళలకు రిజర్వ్ చేశారు. మిగిలిన పోస్టులను ఇతర వర్గాలకు కేటాయించారు.
అర్హత: ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండి 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఏఈ పోస్టులకు అర్హులు.
ఏఈ పోస్టులను కొత్త జోనల్ విధానం కింద టీఎస్‌ఎస్పీడీసీఎల్ పరిధిలోని పోస్టులుగా విభజించారు. సంస్థ పరిధిలోని 16 జిల్లాల అభ్యర్థులు 95% పోస్టుల కోసం పోటీపడడానికి అర్హులు.
సబ్ ఇంజనీర్ పోస్టులకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన వారు అర్హులు.
జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు టెన్త్‌తో పాటు ఎలక్ట్రికల్/ వైర్‌మెన్ ట్రేడ్స్‌లో ఐటీఐ లేదా ఇంటర్ వొకేషనల్‌లో ఎలక్ర్టికల్ కోర్సు చేసిన వారు అర్హులు.
ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200 కాగా, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120. ఎస్టీ/ఎస్టీ/బీసీ/పీహెచ్ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు మినహాయించారు. ముందుగా ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. తద్వారా వచ్చే జర్నల్ నంబర్‌తో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి దరఖాస్తు నింపి సబ్‌మిట్ చేయాలి.
వెబ్‌సైట్: www.tssouthernpower.cgg.gov.in
సెలెక్షన్ ప్రాసెస్
మూడు పోస్టులకు ఆఫ్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష నిర్వహిస్తారు. టెస్ట్ డ్యురేషన్ రెండు గంటలు. ప్రశ్నలు తెలుగు, ఇంగ్లిష్‌లో ఇస్తారు. లైన్‌మెన్ పోస్టుకు పోల్ క్లైంబింగ్‌లో స్కిల్ టెస్ట్/ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. మెరిట్ లిస్ట్‌లో పరిగణనలోకి తీసుకోవాలంటే ఓవరాల్‌గా ఓసీలు 40%, బీసీలు 35%, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌లు 30 శాతం మార్కులు సాధిచాల్సి ఉంటుంది. జూనియర్ లైన్‌మెన్ పరీక్ష 100 మార్కులకుంటుంది. ఇందులో 80 మార్కులు రాత పరీక్ష, 20 మార్కులు ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజీ కింద కేటాయించారు. వారికి ప్రతి ఆరు నెలలకు ఒక మార్కు కలుపుతారు.
ఎగ్జామ్ ప్యాటర్న్
జూనియర్ ఇంజినీర్
న్యూమరికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ 20 ప్రశ్నలు 20 మార్కులు
ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 80 ప్రశ్నలు 80 మార్కులు
మొత్తం 100 ప్రశ్నలు.. 100 మార్కులు
సబ్ ఇంజినీర్
కోర్ టెక్నికల్ సబ్జెక్ట్ 80 ప్రశ్నలు 80 మార్కులు
జనరల్ అవేర్‌నెస్ మరియు న్యూమరికల్ ఎబిలిటీ 20 ప్రశ్నలు 20 మార్కులు
మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులు
జూనియర్ లైన్‌మెన్
ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్) 65 ప్రశ్నలు 65 మార్కులు
జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు 15 మార్కులు
మొత్తం 80 ప్రశ్నలు 80 మార్కులు
సిలబస్ అండ్ టిప్స్
న్యూమరికల్ ఎబిలిటీ & లాజికల్ రీజనింగ్
ఇందులో ఇండిసెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, ప్రాఫిట్ & లాస్, మెన్సురేషన్, ఆల్‌జీబ్రా, జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్, లాజికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లం సాల్వింగ్ వంటి టాపిక్‌ల నుంచి ప్రశ్నలొస్తాయి. ఈసెక్షన్‌కు అత్యధికంగా 40 మార్కులు కేటాయించారు కాబట్టి విద్యుత్ సంస్థల్లో ఇతర పరీక్షల ప్రీవియస్ పేపర్లను విశ్లేషించుకొని ప్రిపేరవ్వాలి.
కంప్యూటర్ అవేర్‌నెస్
ఎంఎస్ ఆఫీస్, కంప్యూటర్ బేసిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ స్కిల్స్, అకౌంట్స్ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్ తదితర అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి. కంప్యూటర్స్ చరిత్ర, జనరేషన్స్, మెమొరీ, అబ్రివేషన్స్, షార్ట్‌కట్స్, టెర్మినాలజీ, కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, పెరిఫెరల్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, మెమొరీ అండ్ స్టోరేజ్ డివైసెస్, ఇంటర్‌నెట్, బ్రౌజర్స్ అండ్ సెర్చ్ ఇంజిన్స్, సోషల్ నెట్‌వర్కింగ్, బ్లాగింగ్, వెబ్ టెక్నాలజీ, టెక్స్ట్ ఫార్మాటింగ్, డీబీఎంఎస్, అప్లికేషన్స్, ప్రింట్, బుక్‌మార్క్, మెయిల్మెర్జ్, వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, ఎక్సెల్ వర్క్‌షీట్స్ ఫార్మాటింగ్, ఎడిటింగ్ తదితర టాపిక్‌లను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
ఇంగ్లిష్ అండ్ జీకే
ఇందులో వొకాబులరీ ప్రధానమైనది. కాంప్రహెన్సన్ ప్యాసేజ్, సెంటెన్స్ రీఅరేంజ్‌మెంట్, సిననిమ్స్, ఆంటోనిమ్స్ తదితర టాపిక్‌లు చదవాలి. ఇంగ్లిష్ పేపర్ చదవడం, న్యూస్ వినడం వల్ల లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. జనరల్ నాలెడ్జ్‌లో కరెంట్ ఆఫైర్స్, కన్స్యూమర్ రిలేషన్స్, నిత్యజీవితంలో సైన్స్, పర్యావరణ సమస్యలు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, తెలంగాణ హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యం నుండి ప్రశ్నలిస్తారు.
ఎలక్ట్రికల్
ఇందులో 10 చాప్టర్లు ఇచ్చారు. ఒక్కోదానిలో తిరిగి 5 నుంచి 10 టాపిక్స్ ఉన్నాయి. ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ర్టిసిటీలో సేఫ్టీ, టూల్స్, కిర్కాఫ్ లా, కెపాసిటర్స్, ఎర్తింగ్ ప్రిన్సిపుల్స్ వంటి టాపిక్‌లనుండి ప్రశ్నలొస్తాయి. బ్యాటరీస్ చాప్టర్‌లో ప్రైమరీ, సెకండరీ బ్యాటరీలు, లెడ్, యాసిడ్ సెల్స్, చార్జింగ్ అండ్ టెస్టింగ్ అప్లికేషన్, ఇన్వర్టర్స్, చార్జర్స్ వంటి అంశాలున్నాయి. మ్యాగ్నటిజమ్, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, బేసిక్ ఎలక్ర్టానిక్స్, డీసీ మెకానిక్స్, ట్రాన్స్‌ఫార్మర్స్, ఏసీ మెషిన్స్, ఎలక్ర్టికల్ మెజర్‌మెంట్స్, ఎలక్ర్టిక్ పవర్ జనరేషన్ తదితర అధ్యాయాలను ఐటీఐ స్థాయిలో చదవాలి.