తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో అప్రెంటిస్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం 300 ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు, డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఈ ట్రైనింగ్ మూడేండ్లు ఉంటుంది. అర్హులైన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు/ డిప్లొమా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు: ఏదైనా సబ్జెక్టులో ఇంజినీరింగ్ డిప్లొమా/ బీఈ/ బీటెక్ పాస్ ఉండాలి. 2022 జులై 1 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
సెలెక్షన్: డిప్లొమా, ఇంజినీరింగ్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో జూన్ 15వ తేదీ వరకు అప్లై చేసుకునే గడువు ఉంది.
స్టైఫండ్: అప్రెంటిస్ ట్రైనింగ్లో స్టైఫండ్ ఇస్తారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.18000, రెండో ఏడాది నెలకు రూ.20,000, మూడో ఏడాది నెలకు రూ.22,000 చెల్లిస్తారు. డిప్లొమా అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.16000, రెండో ఏడాది నెలకు రూ.17500, మూడో ఏడాది నెలకు రూ.19000 చొప్పున చెల్లిస్తారు.
పూర్తి వివరాలు www.tsrtc.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ పీడీఎఫ్ ఇక్కడ అందిస్తున్నాం. ఏయే రీజియన్లలో ఎన్ని పోస్టులున్నాయనే వివరాలు వీటిలో ఉన్నాయి.
RTC conductor
I want a conductor job
In nrpt dist
Conductor job siddipet