ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల భర్తీ టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ప్రకటించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా టీచర్ల భర్తీ ప్రక్రియ నిర్వహించేవారు. అయితే తెలంగాణా ఏర్పాటైన తర్వాత మొదటిసారి 2017లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) నిర్వహించి టీచర్ల నియామకం చేపట్టింది. అయితే టీఎస్పీఎస్సీ ప్రభుత్వ పాఠశాల్లో ఉండే అన్ని పోస్టులకు ఒకే నోటిఫికేషన్ ఇవ్వకుండా …సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలు, ఇలా కేటగీరిల వారీగా వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసింది. దీంతో అభ్యర్థులు కొంత గందరగోళానికి గురయ్యారు. అంతే కాకుండా గతంలో డీఎస్సీ మాదిరిగా జిల్లాల వారీగా అభ్యర్థుల మార్కులు, ర్యాంకులతో సహా మెరిట్ లిస్ట్ విడుదల చేసి అనంతరం ఎంపికైన వారి ప్రొవిజినల్ లిస్ట్ విడుదల చేసి వారికి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించే పద్ధతికి టీఎస్పీఎస్సీ స్వస్తి పలికింది.
బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా ఒక పోస్టులకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌కు పిలిచి అనంతరం ఎంపికైన వారి హాల్‌టికెట్ నంబర్లతో సెలెక్షన్ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో ర్యాంకులు గానీ, అభ్యర్థుల మార్కులు కానీ చూసుకునేందుకు వీలు కల్పించలేదు. దీంతో టీచర్ల ఎంపిక పారదర్శకంగా నిర్వహించలేదని లేదని, డీఎస్సీ ద్వారానే టీచర్ల ఎంపిక బాగుండేదనే అభిప్రాయం అభ్యర్థుల నుంచి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఈ సారి నిర్వహించే టీచర్ల నియామకాలను డీఎస్సీ ద్వారానే నిర్వహిస్తారనే సంకేతాలు వచ్చాయి.
కానీ ప్రక్రియ వేగంగా జరిగేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడుతుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ప్రకటించారు. ఈ మేరకువిద్యాశాఖ అధికారులతో చర్చలు జరిగాయని వారు 10, 500 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. ప్రభుత్వం అనుమతి స్తే దసరా వరకు టీచర్ల భర్తీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.