గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్ పోస్టుల భర్తీపై టీఎస్పీఎస్సీ (TSPSC) ఇటీవల జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈనెల 6న ప్రారంభం అయింది. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లో మొత్తం 57 పోస్టుల రిక్రూట్మెంట్కు ఈ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 32 గెజిటెడ్ పోస్టులు, 25 నాన్ గెజిటెడ్ పోస్టులు ఉన్నాయి. అయితే.. గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నిన్నటితో ముగియగా.. నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ (https://www.tspsc.gov.in/) ద్వారా అభ్యర్థులు తమ అప్లికేషన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు:
- టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజిస్ట్) – 07
- టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజిస్ట్ ) – 05
- టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) – 08
- ల్యాబ్ అసిస్టెంట్ – 01
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 04
విద్యార్హతల వివరాలు:
టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజిస్ట్): అభ్యర్థులు జియాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజిస్ట్): సివిల్ ఇంజనీరింగ్ లో జియాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. లేదా హైడ్రాలజీలో రెండేళ్ల ఎమ్సెస్సీ పూర్తి చేసి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్): జియో ఫిజిక్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా ఎంటెక్ లో జియో ఫిజిక్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
ల్యాబ్ అసిస్టెంట్: కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: జియాలజీలో డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. లేదా మ్యాథ్స్ లో లేదా జియాలజీ ఒక సబ్జెక్ట్ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.