తెలంగాణ నిరుద్యోగులకు TSPSC భారీ శుభవార్త చెప్పింది. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది విడుదల చేసింది. మొత్తం 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెబ్సైట్ లో బ్రీఫ్ నోటిఫికేషన్ జారీ చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ నెల 23 నుంచి ఈ పోస్టులకు సంబంధించిన వివరాలన్నీ టీఎస్ పీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సైతం ఈ నెల 23న ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 12, 2023వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. నియామక పరీక్షను 2023 ఏప్రిల్/మే నెలలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.
అభ్యర్థులు టీఎస్సీఎస్సీ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. డిటైల్డ్ నోటిఫికేషన్ ఈ నెల 23న విడుదల కానుంది. ఆ నోటిఫికేషన్లో జిల్లాలు, రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను వెల్లడించనున్నారు. ఇంకా పోస్టుల వారీగా విద్యార్హతల వివరాలు సైతం నోటిఫికేషన్ విడుదల తర్వాతనే పూర్తి స్థాయిలో తెలియనున్నాయి.
పోస్టుల వారీగా ఖాళీలు:
- జూనియర్ అకౌంటెంట్- 429
- జూనియర్ అసిస్టెంట్- 6,859
- వార్డు ఆఫీసర్ – 1,862
- జూనియర్ ఆడిటర్ – 18
General Administration Department
Administration