తెలంగాణ గ్రూప్-1 (TSPSC GROUP 1 RESULTS) ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల మెరిట్‌తో పాటు రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాతపరీక్షలకు ఎంపిక చేసింది. మొత్తం 25150 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లుగా ప్రకటించింది. గత శుక్రవారం రాత్రి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ ను అఫిషియల్ వెబ్సైట్లో tspsc.gov.in అందుబాటులో ఉంచింది.
ఈ నేపథ్యంలో మెయిన్స్ పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది? అన్న విషయం తెలియక అనేక మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ తాజాగా మోడల్ పేపర్ ను విడుదల చేసింది.
అభ్యర్థుల కోసం ఆ మోడల్ పేపర్ ను అందిస్తున్నాం. పైన అటాచ్ చేసిన పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకుని అభ్యర్థులు మోడల్ పేపర్ ను చూసుకుని అందుకు అనుగుణంగా ప్రిపరేషన్ సాగించవచ్చు.