Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటీఎస్​పీఎస్​సీలో ఇంటి దొంగలు

టీఎస్​పీఎస్​సీలో ఇంటి దొంగలు

పోలీసుల అదుపులో ఇద్దరు.. పాత పేపర్లన్నీ సేఫేనా

టీఎస్​పీఎస్​సీ పరీక్షల లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఇంటి దొంగల పనా.. టెక్నికల్​ విభాగంలోనే ఎవరైనా.. హ్యాకర్లకు సహకరించారా.. అనే కోణంలో పోలీసులు శనివారం రాత్రి నుంచే దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇద్దరు యువకులను అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఇంటి దొంగల పనేనని పోలీసుల విచారణలో తేలింది. టీఎస్​పీఎస్​సీ ఆఫీసులోని సర్వర్​ నుంచే డేటా తస్కరించారని.. అక్కడి నుంచే పేపర్లు లీకవుతున్నాయనే సంచలన విషయాలు బయటపడ్డాయి.

Advertisement

టీఎస్​పీఎస్​సీ సెక్రెటరీ దగ్గర పని చేసే పీఏతో పాటు బోర్డులో పని చేసే మరో అవుట్​ సోర్సింగ్ ఉద్యోగి ఈ లీకేజీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రవీణ్​, రాజశేఖర్​ అనే ఇద్దరు యువకులు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిద్దరే బోర్డులో అవుట్ సోర్సింగ్​ పద్ధతిన పని చేస్తున్నారని.. ఆఫీసర్ల డైరీల్లో ఉన్న పాస్​ వర్డ్ ల ఆధారంగా వీరిద్దరే పేపర్లను లీక్​ చేసినట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే ఆందోళన బోర్డు వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు జరిగిన పేపర్లు కూడా ఇదే తరహాలో లీకయ్యాయా… అవన్నీ భద్రంగానే జరిగాయా.. అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.

టీఎస్​పీఎస్​సీ లో అసలేం జరిగింది..? ఈరోజు (ఈనెల 12 ఆదివారం) జరగాల్సిన టౌన్​ ప్లానింగ్​ రాత పరీక్ష ప్రశ్నపత్రం లీకయిందా.. వచ్చే వారం జరగాల్సిన ఆన్​ లైన్​ పరీక్షల డేటా హ్యాక్​ అయిందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యోగ నియామకాల్లో భాగంగా టీఎస్​పీఎస్​సీ ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రూప్​ 1 ప్రిలిమ్స్​తో పాటు పలు ఉద్యోగ నియామక పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. గ్రూప్​ 1 మెయిన్స్​తో పాటు గ్రూప్​ 2, గ్రూప్​ 3, గ్రూప్​ 4తో పాటు ఇతర పరీక్షల నిర్వహణ ఏర్పాట్లో టీఎస్​పీఎస్​సీ బిజీ బిజీగా ఉంది.

టీఎస్​పీఎస్​సీ పరీక్షల షెడ్యూలు ప్రకారం ఆదివారం ఈనెల 12న Town Planning Building Overseer Recruitment రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. మున్సిపల్ అడ్మినిస్టేషన్​ అండ్​ అర్బన్​ డెవెలప్​మెంట్​ డిపార్టుమెంట్​ పరిధిలోని 175 పోస్టుల భర్తీకి గత సెప్టెంబర్​లోనే టీఎస్​పీఎస్​సీ నోటిఫికేషన్​ జారీ చేసింది. ఆదివారం జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేసినట్లు టీఎస్​పీఎస్​సీ శనివారం రాత్రి ప్రకటన జారీ చేయటం తెలిసిందే. డేటా హ్యక్​ అయిందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ బోర్డ్​ ఛైర్మన్​ జనార్థన్​రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయటం సంచలనం రేపుతోంది. 12వ తేదీ నాటి రాత పరీక్షతో పాటు 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్​ రిక్రూట్​మెంట్​ ఆన్ లైన్​ పరీక్షలను కూడా టీఎస్​పీఎసీసీ రద్దు చేసింది.

Advertisement

వరుసగా రెండు పరీక్షలకు రద్దు చేయటం సందేహాలను లేవనెత్తింది. ఒకటీ రాత పరీక్ష కావటం, రెండోది ఆన్​లైన్​ పరీక్ష కావటంతో ప్రశ్నపత్రం లీకైందని.. ఆన్ లైన్​ పరీక్ష కు సంబంధించిన డేటా ఉన్న సర్వర్​ కూడా హ్యాక్​ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా పోలీసులే పేపర్​ లీకేజీకి సంబంధించిన సమాచారాన్ని టీఎస్​పీఎస్​సీకి అందించినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన బోర్డు అధికారులు వెంటనే మెయిన్​ సర్వర్ లాగిన్​ డిటైయిల్స్​ చెక్​ చేసి.. హ్యాకర్టు లాగిన్​ అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!