HomeLATESTఓటీఆర్​ లేకుంటే.. గ్రూప్​ 1 అప్లై చేయడం కుదరదు.. మరెలా

ఓటీఆర్​ లేకుంటే.. గ్రూప్​ 1 అప్లై చేయడం కుదరదు.. మరెలా

టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 1 అప్లై చేయాలంటే వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​ (OTR) ​తప్పనిసరి. ముందుగా టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​లో అభ్యర్థులందరూ వన్​ టైమ్ రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో రిజిస్ట్రేషన్​ చేసుకున్న అభ్యర్థులు కొత్త జోన్లు.. స్థానికత ఆధారంగా తమ ఓటీఆర్​ను తప్పనిసరిగా అప్​డేట్ ​ చేసుకోవాలి. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా వెబ్​సైట్​లో వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​ను అప్ డేట్​ చేసుకోవాలని టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది. అప్ డేట్​ చేసుకున్నవాళ్లే గ్రూప్​ 1కు అప్లై చేసుకునేందుకు అర్హులవుతారని స్పష్టం చేసింది.

ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 25 లక్షల మంది ఓటీఆర్ కలిగి ఉన్నారు. అప్​ డేట్​ అప్షన్​ ఇచ్చిన తర్వాత 1.23 లక్షల మంది మాత్రమే అప్​డేట్​ చేసుకున్నారు. 48400 మంది కొత్తగా రిజిస్టేషన్​ చేసుకున్నారు. గ్రూప్​ 1​ అప్లికేషన్లు మే 2 నుంచి ప్రారంభమవుతాయి. ఆన్​లైన్​లో అప్లై చేసేటప్పుడు ఓటీఆర్​లో ఉన్న వివరాలే అక్కడ ప్రత్యక్షమవుతాయని…అవన్నీ చెక్​ చేసుకొని అప్లై చేసుకునే అవకాశముంటుందని గ్రూప్​ వన్​ డిటైల్డ్ నోటిఫికేషన్​లో టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది. అందుకే ఆలస్యం చేయకుండా ఓటీఆర్ అప్​ డేట్​ చేసుకోవాలి. కొత్త అభ్యర్థులు వెంటనే రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. టీఎస్​పీఎస్​సీ పంపించే అప్​డేట్లు అందుకోవాలంటే.. అందరూ ఓటీఆర్​లో తమ మొబైల్​ ఫోన్​ నెంబర్లు, మెయిల్​ఐడీలు సరిచూసుకోవాలి.

గ్రూప్​ వన్​ అప్లై చేసేటప్పుడు

అభ్యర్థులందరూ ముందుగా టీఎస్​పీఎస్​సీ ద్వారా ఓటీఆర్​ నమోదు చేసుకోవాలి. పాత ఓటీఆర్​ ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా అప్​ డేట్ చేసుకోవాలి.

  • పోస్టులకు అప్లై చేసేటప్పుడు ఓటీఆర్ రిజిస్ట్రర్​ చేసుకున్న అభ్యర్థులు TSPSC ID మరియు Date of Birth ఎంటర్​ చేసి తమ ప్రోఫైల్ కు లాగిన్​ కావాలి.
  • అభ్యర్థులు TSPSC ID మరిచిపోతే.. టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​లో “Know Your TSPSC_ID” లింక్​పై క్లిక్​ చేయాలి. తమ ఆధార్​ కార్డ్ నెంబర్​, డేట్​ ఆఫ్​ బర్త్ ఎంటర్​ చేసి.. టీఎస్​పీఎస్​సీ ఐడీ పొందవచ్చు. వీలుంది.
  • రిజిస్టేషన్​ చేసేటప్పుడు, పోస్టులకు అప్లై చేసేటప్పుడు.. అభ్యర్థులందరూ తమ
    ఆధార్​కార్డు,
    విద్యార్హతల సర్టిఫికెట్లు (ఎస్​ఎస్​సీ నుంచి డిగ్రీ.. వరకు),
    స్డడీ/బోనఫైడ్​ లేదా నివాస ధ్రువీకరణ పత్రం(రెసిడెన్స్​ సర్టిఫికెట్​,
    కమ్యూనిటీ(క్యాస్ట్) సర్టిఫికెట్​,
    ఈడబ్ల్యుఎస్​,
    స్పోర్ట్స్​,
    పీహెచ్​ సర్టిఫికెట్
    వీటికి సంబంధించిన సాప్ట్ కాపీలు.. అప్​లోడ్​ చేసేందుకు వీలుగా అందుబాటులో ఉంచుకోవాలి.

​అందుకే.. అప్​డేట్​ చేసుకొండిలా.. ​

తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (టీఎస్​పీఎస్సీ) వెబ్​సైట్​లో వన్​టైమ్​ రిజిస్ట్రేషన్​ చేసుకున్న అభ్యర్థుల వివరాలు సవరణ చేసుకునేందుకు టీఎస్​పీఎస్సీ అవకాశం కల్పించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్​ ఐడి కలిగిన అభ్యర్థులకు ఎడిట్​ ఆప్షన్​తో పాటు కొత్త వారు కూడా రిజిస్ట్రేషన్​ చేసుకునేలా వెబ్​సైట్​ అందుబాటులోకి తెచ్చింది.

  • తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాలు 33 జిల్లాలు పునర్విభజన చెందిన నేపథ్యంతో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు అభ్యర్థుల స్థానికతను సవరించుకోవచ్చు. 33 జిల్లాల్లో రెండు మల్టీ జోన్లు, ఏడు జోన్లు ఏర్పాటైనందున వాటి ప్రకారం అభ్యర్థల స్థానికతను ఖరారు చేసుకోవచ్చు. సుమారు 25 లక్షల మంది అభ్యర్థులు దీని ద్వారా స్థానికతలో మార్పులు చేసుకోనున్నారు.
  • ముందుగా అభ్యర్థులు తమ స్థానికత వివరాలను సవరించుకోవాల్సి ఉంటుంది. టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ, 1-7వ తరగతి వరకు వివరాలు ప్రస్తుత 33 జిల్లాలకు అనుగుణంగా నమోదు చేయాలి. వీటితో పాటు గతంలో ఉన్న విద్యార్హతల్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని కూడా జత చేయవచ్చు.
  • టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ ఓపెన్​ చేసి న్యూ రిజిస్ట్రేషన్‌ పై క్లిక్‌ చేయాలి. తర్వాత మొబైల్‌ నంబరు ఎంట్రీ చేస్తే వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి.
  • అప్లికేషన్​ ఫారంలో వ్యక్తిగత సమాచారం, చిరునామా, ఈ-మెయిల్‌ ఐడీ, అభ్యర్థులు 1-7వ తరగతి వరకు చదివిన జిల్లాల వివరాలను, విద్యార్హతలను ఎంట్రీ చేయాలి.
  • తర్వాత అభ్యర్థి ఫొటో, సంతకం అప్‌లోడ్‌ చేయాలి. ఈ వివరాలన్నీ సబ్మిట్‌ చేసిన తరవాత టీఎస్‌పీఎస్సీ ఐడీ జనరేట్​ అవుతుంది. దానిని డౌన్లోడ్​ చేసుకుని భద్రపరుచుకోవాలి.
  • ఓటీఆర్‌ ఎడిట్‌ చేసుకోవాలంటే వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ఓటీఆర్‌పై క్లిక్‌ చేసి టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి. తరువాత ఫోన్‌ నంబరు ఎంట్రీ చేస్తే ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేయాలి.
  • తర్వాత ఎడిట్‌ చేయాల్సిన వివరాలు కరెక్ట్​గా నమోదు చేసి అభ్యర్థులు 1-7వ తరగతి వరకు చదివిన జిల్లాలను ఎంపిక చేసుకుని విద్యార్హతలను నమోదు చేయాలి. తర్వాత అభ్యర్థి ఫొటో, సంతకం అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ చేస్తే కొత్త ఓటీఆర్​ జనరేట్​ అవుతుంది.
merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!