తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. మహిళా అబివృద్ధి శిశు సంక్షేమ విభాగంలో (women development and child welfare department) ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 181 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) గ్రేడ్ వన్ పోస్టులను జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. బీఎస్సీ, సోషియాలజీ, బీఏ సోషల్ వర్క్, బీఏ హోం సైన్స్ కోర్సులతో డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 29 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష డిసెంబర్లో నిర్వహించే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అందుకు సంబంధించిన ప్రకటనతో పాటు డిటైల్డ్ నోటిఫికేషన్ పీడీఎఫ్‌ను అందిస్తున్నాం.
Abcd