HomeLATESTబిగ్ బ్రేకింగ్.. నేడే గ్రూప్-3 తో పాటు మరో జాబ్ నోటిఫికేషన్!

బిగ్ బ్రేకింగ్.. నేడే గ్రూప్-3 తో పాటు మరో జాబ్ నోటిఫికేషన్!

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో గ్రూప్-1 కు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ కూడా పూర్తయింది. గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. గ్రూప్-2 నోటిఫికేషన్ నిన్న విడుదల కాగా.. జనవరి 18 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Read This: తెలంగాణ గ్రూప్​ 2 డిటైల్డ్ నోటిఫికేషన్​ 2022
Read This: 9,168 గ్రూప్-4 ఖాళీలకు ప్రారంభమైన దరఖాస్తులు.. ఆఖరి తేదీపై క్లారిటీ ఇచ్చిన కమిషన్.. వివరాలివే

Advertisement

అయితే.. ఈ రోజు మరో టీఎస్పీఎస్సీ నుంచి మరో రెండు జాబ్ నోటిఫికేసన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. శుక్రవారం అత్యవసరంగా భేటీ అయిన టీఎస్పీఎస్సీ పాలకవర్గం గ్రూప్-3 నోటిఫికేషన్ తో పాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లేదా లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి చర్చిస్తోంది. సాయంత్రం వరకు గ్రూప్-3 తో పాటు మరో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ రోజు పాలకవర్గ భేటీ ముగియడం ఆలస్యమైతే రేపు ఉదయం ఆయా నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంది. గ్రూప్-3 కి సంబంధించి 1400 వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!