తెలంగాణలో గ్రూప్-1, పోలీసు ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ఫోకస్ చేసింది. గ్రూప్-4 విభాగంలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా గ్రూప్-4 నోటిఫికేషన్‌పై టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, అధికారులు, సంబంధిత శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
మే 29 వరకు వివరాలివ్వాలి
గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లు సహా అవసరమైన వివరాలు, సమాచారాన్ని మే 29వ తేదీలోపు టీఎఎస్‌పీఎస్‌సీకి అందించాలని అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ ఆదేశించారు. జూనియర్ అసిస్టెంట్, సమాన స్థాయి పోస్టుల ఖాళీలన్నింటినీ నోటిఫికేషన్‌లో చేర్చాలని, పదోన్నతుల ద్వారా వచ్చే ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పారు. ప్రక్రియ పూర్తికి ఎక్కువ సమయం తీసుకోకుండా అన్ని శాఖల అధిపతులు ప్రత్యేక దృష్టి సారించి పోస్టుల భర్తీకి వీలైనంత త్వరగా ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని సీఎస్ సూచించారు.
Hiii