HomeLATEST9,168 గ్రూప్-4 ఖాళీలకు ప్రారంభమైన దరఖాస్తులు.. ఆఖరి తేదీపై క్లారిటీ ఇచ్చిన కమిషన్.. వివరాలివే

9,168 గ్రూప్-4 ఖాళీలకు ప్రారంభమైన దరఖాస్తులు.. ఆఖరి తేదీపై క్లారిటీ ఇచ్చిన కమిషన్.. వివరాలివే

గ్రూప్-4 నోటిఫికేషన్ ను డిసెంబర్ 1న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 9168 గ్రూప్-4 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది కేసీఆర్ సర్కార్. ముందుగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 23న ప్రారంభించాల్సి ఉంది. అయితే.. సాంకేతిక కారణాలతో దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేశారు. ఈ రోజు డిసెంబర్ 30 నుంచి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడంతో దరఖాస్తు గడువును సైతం పొడిగించారు.

Advertisement

దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 19 వరకు అవకాశం కల్పించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది. ఈ రోజు దరఖాస్తుల ప్రారంభం సందర్భంగా టీఎస్పీఎస్సీ అనితా రామచంద్రన్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 30 నుంచి జనవరి 19వ తేదీ వరకు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లో అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. దరఖాస్తు తేదీని పొడిగించే అవకాశమే లేదని స్పష్టం చేశారు. అభ్యర్థులంతా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి వచ్చే ఏడాది ఏప్రిల్​ లేదా మే నెలలో గ్రూప్​-4 రాత పరీక్ష ఉంటుందని టీఎస్​ పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్​ వెల్లడించారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!