తెలంగాణలో మొత్తం 1363 గ్రూప్-3 (TSPSC Group-3) ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హలు. ఏ పోస్టుకు ఏ విభాగంలో డిగ్రీ అన్న పూర్తి వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు. ఈ ఉద్యోగాలకు వయో పరిమితి 18-44 ఏళ్లు. వివిధ వర్గాలకు వయో పరిమితిలో సడలింపులు ఇచ్చారు. ఇందుకు సంబంధిచిన పూర్తి వివరాలు సైతం నోటిఫికేషన్లో చూడొచ్చు. గ్రూప్ 3 ఎగ్జామ్ ను జులై లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉంది.
పెరిగిన పోస్టులు:
గ్రూప్-4లో మరో 12 పోస్టులను పెంచుతూ నిర్ణయిం తీసుకుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అదనంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను పెంచింది. ఇప్పటికే ఈ సొసైటీ పరిధిలోని 26 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం పెంచిన 12 పోస్టులతో కలిపి ఆ సంఖ్య 38కి చేరింది. కొత్తగా చేర్చిన 12 పోస్టులతో కలిపి మొత్తం గ్రూప్-3లో పోస్టుల సంఖ్య 1,375కి చేరింది.
టీఎస్పీఎస్సీ గ్రూప్-3 అప్లికేషన్ లింక్-LINK
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. నిరుద్యోగులకు ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు మినహాయింపు ఇచ్చారు.