తెలంగాణలో మొత్తం 1363 గ్రూప్-3 (TSPSC Group-3) ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ఈ రోజు నుంచి ప్రారంభించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హలు. ఏ పోస్టుకు ఏ విభాగంలో డిగ్రీ అన్న పూర్తి వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు. ఈ ఉద్యోగాలకు వయో పరిమితి 18-44 ఏళ్లు. వివిధ వర్గాలకు వయో పరిమితిలో సడలింపులు ఇచ్చారు. ఇందుకు సంబంధిచిన పూర్తి వివరాలు సైతం నోటిఫికేషన్లో చూడొచ్చు. గ్రూప్ 3 ఎగ్జామ్ ను జులై లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉంది.
టీఎస్పీఎస్సీ గ్రూప్-3 అప్లికేషన్ లింక్-LINK
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. నిరుద్యోగులకు ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు మినహాయింపు ఇచ్చారు.