HomeLATESTగ్రూప్-2కు దరఖాస్తుల వెల్లువ.. మొదటి రోజే ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే?

గ్రూప్-2కు దరఖాస్తుల వెల్లువ.. మొదటి రోజే ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే?

తెలంగాణలో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను జనవరి 18న అంటే నిన్న ప్రారంభించారు అధికారులు. దరఖాస్తులు ప్రారంభమైన తొలిరోజే భారీగా నిరుద్యోగులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్నారు. నిన్న సాయంత్రం వరకే మొత్తం 15,405 దరఖాస్తులు వచ్చాయని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 16ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. గడువు తేదీలోగా ఇంకా భారీగా అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. దరఖాస్తుల సంఖ్య 5 లక్షలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంచనా.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!