HomeLATESTప్రిలిమ్స్ నెగ్గాలంటే చదవాల్సిన ముఖ్యమైన టాపిక్స్

ప్రిలిమ్స్ నెగ్గాలంటే చదవాల్సిన ముఖ్యమైన టాపిక్స్

టీఎస్​పీఎస్​సీ ఇచ్చిన లేటెస్ట్ సిలబస్ ప్రకారం ఏమేం టాపిక్స్ ఇంపార్టెంట్​..​ ఏమేం చదవాలి… ఏవి చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి.. నిపుణుల సూచనలు, సలహాలకు అనుగుణంగా రూపొందించిన డిటైల్డ్ ప్రిపరేషన్​ గైడ్​ ఇక్కడ అందుబాటులో ఉంది. దీని ప్రకారం అభ్యర్థులు క్రమపద్ధతిలో చదివితే ఎక్కువ మార్కులు మీ సొంతమవుతాయి. ఇప్పటినుంచీ మీ ప్రిపరేషన్​ ప్రారంభించినా ప్రిలిమ్స్​లో మీరు సునాయాసంగా విజయం సాధిస్తారు. ఆల్​ ది బెస్ట్.

Advertisement

TSPSC గ్రూప్ 1  ప్రిలిమ్స్ సిలబస్

జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ

  1.  కరెంట్ అఫైర్స్ – ప్రాంతీయ, జాతీయ & అంతర్జాతీయ.
  2. అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు.
  3. జనరల్ సైన్స్; సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలు.
  4. పర్యావరణ సమస్యలు; విపత్తు నిర్వహణ- నివారణ మరియు ఉపశమనం వ్యూహాలు.
  5. భారతదేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి.
  6.  ప్రపంచ భూగోళ శాస్త్రం, భారతీయ భౌగోళిక శాస్త్రం మరియు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక శాస్త్రం.
  7. భారతదేశ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం.
  8. భారత రాజ్యాంగం మరియు రాజకీయాలు.
  9. భారతదేశంలో పాలన మరియు పబ్లిక్ పాలసీ.
  10. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం.
  11. తెలంగాణ రాష్ట్ర విధానాలు.
  12. సామాజిక మినహాయింపు, హక్కుల సమస్యలు మరియు సమగ్ర విధానాలు.
  13. భారత రాజ్యాంగం మరియు రాజకీయాలు.
  14.  లాజికల్ రీజనింగ్; అనలిటికల్ ఎబిలిటీ మరియు డేటా ఇంటర్‌ప్రెటేషన్.


కరెంట్ అఫైర్స్ – ప్రాంతీయ, జాతీయ & అంతర్జాతీయం:

అభ్యర్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్‌పై దృష్టి పెట్టాలి. పరీక్షకు ముందు ఆరు నెలల కరెంట్ అఫైర్స్‌పై  పూర్తి అవగాహన ఉండాలి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్​ వరకు కరెంట్​ అఫైర్స్​ ప్రిపేర్​ కావాలి.

Advertisement

అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు:

కరెంట్​ అఫైర్స్​ను బిట్లు బిట్లుగా కాకుండా.. టాపిక్​ వైజ్​ అవహగాన చేసుకునేలా చదివితే ఈ టాపిక్​ నుంచి వచ్చే ప్రశ్నలు ఈజీగా ఆన్సర్​ చేయగలుగుతారు. అంతర్జాతీయ సంబంధాలపై కనీసం 5 ప్రశ్నలుండే అవకాశముంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఉక్రెయిన్​–రష్యా వార్​తో ముడిపడి ఉన్న అంతర్జాతీయ సంబంధాలు, భద్రతా మండలిలో ఓటింగ్​ లాంటి అంశాలన్నీ ఇక్కడ ప్రశ్నలుగా అడిగే ఛాన్స్​ ఉంటుంది.

జనరల్ సైన్స్; సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలు:

సైన్స్​ అండ్​ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలపైనే ఎక్కువగా ఫోకస్​ ఉంటుంది. అణురంగం, రక్షణ రంగం, అంతరిక్ష రంగం.. ఉదాహరణకు బ్రహ్మోస్​, చంద్రయాన్​ లాంటి అప్​డేటేడ్​ అంశాల నుంచి  ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. కంప్యూటర్స్​ అండ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ, బయో టెక్నాలజీ,  క్లోనింగ్​, హెల్త్​​ టెక్నాలజీ, అగ్రికల్చర్​ టెక్నాలజీ అంశాలు ఇక్కడ కవర్​ చేయాలి. 6 నుంచి 10వ తరగతుల సీబీఎస్​ఈ/ఎన్​సీఈఆర్​టీ సైన్స్ టెక్స్ట్ బుక్స్​ చదవాలి. అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.

పర్యావరణ సమస్యలు; విపత్తు నిర్వహణ- నివారణ మరియు ఉపశమనం వ్యూహాలు:

ఎన్విరాన్​మెంట్​, డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ అన్ని పరీక్షల్లోనూ ఇప్పుడు కీలకంగా మారింది. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పర్యావరణ శాస్త్రాలపై ICSE పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి. విపత్తు నిర్వహణ కోసం 8, 9, 10వ తరగతి NCERT పాఠ్యపుస్తకాలను చదవాలి.

Advertisement

భారతదేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి:

వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం, సూక్ష్మ అర్థ శాస్త్రం, స్థూల అర్ధ శాస్త్రం, ప్రణాళికలు, నీతి అయోగ్​, ఆర్థిక సంస్కరణలు, బడ్జెట్​, గ్రామీణాభివృద్ధి, అంతర్జాతీయ వ్యాపారం, దేశ ఆర్థిక వ్యవస్థ. జనాభా టాపిక్ లను చదవాలి. జీడీపీ, జీఎస్​డీపీ, వృద్ధి రేటు, తలసరి ఆదాయం నుంచి తప్పనిసరి ప్రశ్నలుంటాయి.  2021–22 ఎకనమిక్​ సర్వే రిపోర్టుపై  పట్టు సాధించాలి. NCERT 9వ తరగతి నుండి 12వ తరగతి పాఠ్యపుస్తకాల నుండి భారత ఆర్థిక వ్యవస్థ ప్రాథమికాంశాలను చదవాలి.

ప్రపంచ భూగోళ శాస్త్రం, భారతీయ భౌగోళిక శాస్త్రం మరియు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక శాస్త్రం:

భూ స్వరూపం, శీతోష్ణ స్థితి,  గ్రహాలు వాటి స్థితి, స్వభావం, సముద్రాలు నదులు, తీరాలు–పొడవు విస్తీర్ణం లోతు తదితర అంశాలు, దీవులు, దేశాలు, రాష్ట్రాల సరిహద్దులు, పర్వతాల ఎత్తు నుంచి తప్పనసరి ప్రశ్నలుంటాయి. తెలంగాణ, భారత దేశ భూగోళ శాస్త్రాలే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్​, చైనా, జపాన్, అస్ట్రేలియా తదితర దేశాల ప్రాంతీయ భూగోళ శాస్త్రాల ముఖ్యాంశాలు చదువుకోవాలి. 7 నుండి 10 తరగతుల వరకు NCERT పాఠ్యపుస్తకాలను తప్పనిసరిగా చదవాలి.

భారతదేశ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం:

పురాతన, మధ్య యుగ, ఆధునిక చరిత్రను చదవాలి. కాలాలకు అనుగుణంగా అప్పటి  సంస్కృతి, సాంస్కృతిక సేవల, అభివృద్ధి, ఆదరణపై ఎక్కువ ప్రశ్నలుంటాయి. ప్రాచీన భారత దేశ చరిత్రలో పూర్వ చారిత్రక సంస్కృతులు, సింధూ నాగరికత, లోహ యుగం, వేద కాలం నాటి ఆర్య నాగరికత, జైన బౌద్ధ మతం, మగధ, మౌర్య, శుంగ,కణ్వ వంశాలు, ఇండోగ్రీకులు, కుషాణులు, ఖార వేలుడు, శాతవాహనులు. సంగ యుగం, గుప్తులు, హర్ష వర్ధణుడు, చాళుక్యులు, పల్లవుల నుంచి ముఖ్యమైన అంశాలు కవర్​ చేయాలి. మధ్య యుగ చరిత్రలో రాజపుత్రులు, రాష్ట్ర కూటులు, చోళుల నుంచి మహారాష్ట్రులు శివాజీ వరకు టాపిక్స్​ ఉంటాయి. భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యం, ఇండో ఇస్లామిక్​ సంస్కృతి నుంచి తప్పనిసరి ప్రశ్నలుంటాయి. విజయనగర సామాజ్ర్యం, బహమనీ, దక్కన్​ ముస్లిం, మొగల్​ సామ్రాజ్యం నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగి ఛాన్స్​ ఉంది. ఐరోపా వాసుల ఆగమనం నుంచి బ్రిటిష్​ సామ్రాజ్యం, జాతీయ ఉద్యమం, స్వాతంత్య్రానంతర పరిణామాల వరకు చరిత్ర నుంచి లోతైన ప్రశ్నలే ఉంటాయి.

Advertisement

భారత రాజ్యాంగం మరియు రాజకీయాలు:

భారత రాజ్యాంగ నిర్మాణం, రచన, ముఖ్య లక్షణాలు, ప్రాధమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, సమాఖ్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేబినేట్​, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రిమండలి, గవర్నర్​, 73, 74 రాజ్యాంగ సవరణలు, ఎన్నికల వ్యవస్థల, న్యాయ వ్యవస్థ, జాతీయ కమిషన్లు, రాజ్యంగ సవరణలు. అత్యవసర అధికారాలు.. రాజకీయ పార్టీలు, పౌరసత్వం.. ఈ టాపిక్స్​ క్రమ పద్ధతిలోచదువుకోవాలి.  

భారతదేశంలో పాలన మరియు పబ్లిక్ పాలసీ:

పరిపాలనా, ప్రభుత్వ వ్యవస్థలు, నిర్మాణం, ఆవిర్భావం, చారిత్రక నేపథ్యం, భారతదేశ పాలన, విత్త పాలన, సిబ్బంది పాలన, స్థానిక సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాజ్యాంగ వ్యవస్థలను ఇక్కడ స్టడీ చేయాల్సి ఉంటుంది.  

తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం:

తెలంగాణ చరిత్రలో ఇదో భాగం. తెలంగాణ చారిత్రక పూర్వ యుగం నుంచి శాతవాహనులు రాజకీయ చరిత్ర, ఇక్ష్వాకుల సంస్కృతి, విష్ణుకుండినుల సాంస్కృతిక సేవ, జైన, బౌద్ధ, శైవ మతాల అభివృద్ధి ఆదరణ, బాదామి చాళుక్యుల సాహిత్య శిల్ప కళాసేవ, కాకతీయులు బ్రహ్మనీ రాజ్యం సాంస్కృతిక సేవ, మెఘల్స్​ పాలనలో కళలు, సాహిత్యం కీలకంగా చదవాలి. అసఫ్​జాహీలు, నిజాం రాజులు, తెలంగాణ సంస్కృతి, పండుగలు, కళలు, తెలంగాణ కవులు సాహిత్యం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలతో ప్రిపేర్​ అవ్వాలి.

Advertisement

తెలంగాణ రాష్ట్ర విధానాలు:

తెలంగాణ ప్రభుత్వ పథకాలన్నీ ఒకసారి అవలోకనం చేయాలి. ఉచిత విద్యుత్​, రైతు బంధు నుంచి కళ్యాణ లక్ష్మి రైతు బీమా, టీ ప్రైడ్​, మిషన్​ భగీరథ, మిషన్​ కాకతీయ.. దళిత బంధు వరకు.. వరుసగా అన్ని స్కీములు.. స్కీమ్​ లక్ష్యం.. స్కీమ్​ ఎవరికి ఉద్దేశించింది..   వాటిని ఎప్పుడు.. ఎక్కడ ప్రారంభించారు.. ఇలా వివిధ కోణాల్లో చదువుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం 2 జూన్ 2014 నుండి ప్రారంభించిన అన్ని పాలసీలను అవగాహన చేసుకోవాలి. తెలంగాణ సామాజిక-ఆర్థిక సర్వేలో ఇవన్నీ వివరంగా ఉన్నాయి. ఈ టాపిక్​ నుంచి ఈజీగా మార్కులు స్కోర్​ చేసే ఛాన్స్​ ఉంటుంది.  

సామాజిక మినహాయింపు, లింగ వివక్ష, కులాలు, గిరిజనులు హక్కులు మరియు సమగ్ర విధానాలు:

భారతీయ సమాజం, నిర్మాణం, సామాజిక హక్కులు, అంటరానితనం, వివక్ష, కులాలు, గిరిజనులు వికలాంగులు, వీటికి సంబంధించిన సామాజిక ఉద్యమాలు, హక్కులు, సామాజిక దురాచారాలను పారదోలేందుకు అమలైన విధానాలు. ఈ టాపిక్స్​ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

లాజికల్ రీజనింగ్; అనలిటికల్ ఎబిలిటీ మరియు డేటా ఇంటర్‌ప్రెటేషన్:

దిశలు, కాలం, వయస్సులు, క్యాలెండర్​, స్థాన అమరికలు,  షరతులు, రక్త సంబంధాలు, కోడింగ్​ డీకోడింగ్​, ర్యాంకింగ్​ వరుసలు, విశ్లేషణాత్మక హేతువు, లాజికల్​ వెన్​ చిత్రాలు, స్థాన అమరికలు, వీటికి సంబంధించిన ప్రశ్నలు అనలిటికల్​ ఎబిలిటీలో అడుగుతారు. బార్ గ్రాఫ్​లు, పై గ్రాఫ్​లు, చార్టులు, దత్తాంశ విశ్లేషణ, సగటు, నిష్పత్తికి సంబంధించిన ప్రశ్నలు డేటా ఇంటర్​ ప్రెటేషన్​లో వస్తాయి. వీటిని  ప్రాక్టీస్​ చేయాలి.

Advertisement

DONT MISS TO READ: ప్రిలిమ్స్​ కటాఫ్ ఎంత.. ఎన్ని మార్కులు వస్తే మెయిన్స్​కు క్వాలిఫై అవుతారు..!  

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!