Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsBREAKING : రేపే గ్రూప్​ 1 ఫైనల్​ కీ... మార్కులపై టీఎస్​పీఎస్​సీ కీలక నిర్ణయం

BREAKING : రేపే గ్రూప్​ 1 ఫైనల్​ కీ… మార్కులపై టీఎస్​పీఎస్​సీ కీలక నిర్ణయం

గ్రూప్‌-1 ప్రిలిమినరీ ఎగ్జామ్​ ఫైనల్‌ కీ రేపు (నవంబర్​ 15న) విడుదల చేసేందుకు టీఎస్​పీఎస్​సీ అన్ని ఏర్పాట్లు చేసింది. TSPSC ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ అక్టోబర్‌ 29న విడుదల చేసింది. నవంబర్​ 10వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించింది. వెయ్యికిపైగా అభ్యంతరాలు రావటంతో వాటి పరిశీలనకు ఎక్స్​ఫర్ట్ కమిటీని నియమించింది. ఈ కసరత్తు పూర్తి కావటంతో మంగళవారం ఫైనల్​ కీ రిలీజ్​ చేయాలని టీఎస్​పీఎస్​సీ నిర్ణయం తీసుకుంది.

మొత్తం 150 ప్రశ్నల్లో రెండు మూడు మాత్రమే తప్పులు, ప్రింటింగ్ ఎర్రర్లు ఉన్నట్లు గుర్తించింది. వీటికి మార్కులు కలపాల్సిన అవసరం లేదని, అభ్యర్థులందరికీ మార్కులు కలిపితే ప్రయోజనమేమీ లేదని టీఎస్​పీఎస్​సీ భావిస్తోంది. అందుకే 150 ప్రశ్నల్లో తప్పుగా గుర్తించినవి తొలిగించినట్లుగా పరిగణించి.. మిగతా 147 మార్కుల్లో మెరిట్ ప్రకారం క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితా సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.

టీఎస్‌పీఎస్సీ 503 గ్రూప్‌-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా 2,86,051 మంది ప్రిలిమినరీ పరీక్ష
రాశారు. పోస్టుల రోస్టర్​ను బట్టి.. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. హైకోర్టులో కేసు ఉన్నందున.. ముందుగా టీఎస్​పీఎస్​సీ ఫైనల్​ కీ మాత్రమే విడుదల చేయనుంది. కోర్టు తీర్పు వెలువడగానే క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ కానుంది.

(NOTE: టీఎస్​పీఎస్​సీ ఫైనల్​ కీ విడుదల చేసిన వెంటనే అఫిషియల్​ వెబ్​సైట్​లో కీ అందుబాటులో ఉంటుంది. అందుకు సంబంధించిన డైరెక్ట్ లింక్​ వెంటనే అప్​డేట్ అవుతుంది)​

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!