గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఫైనల్ కీ రెండు రోజుల్లోపు విడుదల చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వర్గాలు తెలిపాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ పరీక్షకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ అక్టోబర్ 29న ప్రిలిమినరీ కీ విడుదల చేసింది. నవంబర్ 10వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించింది. దాదాపు వెయ్యిపైగా అభ్యంతరాలు రావటంతో టీఎస్‌పీఎస్సీ ఎక్స్‌ఫర్ట్ కమిటీని నియమించింది.
వరుసగా మూడు రోజుల పాటు సమావేశమైన ఎక్స్‌ఫర్ట్ కమిటీ నిపుణులు అభ్యర్థులు ఛాలెంజ్ చేసిన ప్రశ్నలు, వాటి సమాధానాలు.. సూచించిన ఆధారాలను పరిశీలించారు. నవంబర్ 14న సోమవారం జరిగే ఫైనల్ మీటింగ్‌లో వీటికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం 150 ప్రశ్నల్లో పదింటికి సమాధానాలు తప్పుగా ఉన్నాయని ఎక్కువ మంది అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటిలో ఎన్నింటిని ఎక్స్‌ఫర్ట్ కమిటీ పరిగణనలోకి తీసుకుంది.. ఎన్ని మార్కులు కలుపుతారనేది సోమవారం జరిగే ఫైనల్ మీటింగ్‌లో తేలనుంది.
తప్పులు, ప్రింటింగ్ మిస్టేక్‌ల కారణంగా రెండు లేదా మూడు మార్కులు ఖచ్చితంగా కలిపే అవకాశముంటుందని అభ్యర్థులు చెబుతున్నారు. వీటిని పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ కలిపితే ప్రయోజనం ఏమీ ఉండదనే వాదనలున్నాయి. అందుకే ఈ ప్రశ్నలను అటెంప్ట్ చేసిన వారికి మాత్రమే మార్కులు కలుపాలా..? అసలు మార్కులు కలపాల్సిన అవసరముందా.. లేదా.. అనే అభిప్రాయాలపై టీఎస్‌పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది అభ్యర్థుల్లో ఉత్కంఠ రేపుతోంది.
టీఎస్‌పీఎస్సీ 503 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా 2,86,051 మంది ప్రిలిమినరీ పరీక్ష
రాశారు. వీరిలో పోస్టుల రోస్టర్‌ను బట్టి.. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. హైకోర్టులో కేసు ఉన్నందున.. ముందుగా టీఎస్‌పీఎస్సీ ఫైనల్ కీ మాత్రమే విడుదల చేస్తుందని చేస్తుందని.. కోర్టు తీర్పు వెలువడగానే క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేసే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈలోపు కోర్టు తీర్పు ఇస్తే.. రెండూ ఒకరోజే వెలువడే ఛాన్స్ ఉంది.
TSPSC GROUP 1 FINAL KEY DIRECT LINK
(NOTE: టీఎస్‌పీఎస్సీ ఫైనల్ కీ విడుదల చేసిన వెంటనే అఫిషియల్ వెబ్సైట్లో కీ అందుబాటులో ఉంటుంది. అందుకు సంబంధించిన డైరెక్ట్ లింక్ వెంటనే అప్డేట్ అవుతుంది)