Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్ 2, ఎఫ్​బీవో, హాస్టల్​ వార్డెన్ నోటిఫికేషన్లపైనే టీఎస్​పీఎస్​సీ భేటీ

గ్రూప్ 2, ఎఫ్​బీవో, హాస్టల్​ వార్డెన్ నోటిఫికేషన్లపైనే టీఎస్​పీఎస్​సీ భేటీ

గ్రూప్​ 2 పోస్టుల నోటిఫికేషన్​పై చర్చించేందుకు అత్యవసరంగా భేటీ అయిన టీఎస్​పీఎస్​సీ బోర్డు కీలక నిర్ణయాలేవీ తీసుకోకుండానే సమావేశం ముగించింది. లక్షలాది మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్​ 2 (TSPSC GROUP 2) పోస్టుల భర్తీపైనే ఎక్కువ సేపు చర్చించింది. వీటితో పాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్​, హాస్టల్​ వార్డెన్​ పోస్టులపై చర్చ జరిగినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు బోర్డు మీటింగ్ కొనసాగింది. 728 గ్రూప్​ 2 పోస్టులతో పాటు 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్​ పోస్టులకు ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. గ్రూప్​ 1 పై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గ్రూప్​ 2, ఫారెస్ట్ బీట్​ ఆఫీసర్​ పోస్టుల విషయంలోనూ హారిజంటల్​ రిజర్వేషన్​ విధానం పాటించాలని బోర్డులో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా కసరత్తు పూర్తి కాగానే నోటిఫికేషన్​ జారీ చేయనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. కోర్టు తీర్పుకు అనుగుణంగా రిజర్వేషన్లను మార్చాల్సి ఉండటంతో ఈ రోజు వెలువడాల్సిన గ్రూప్​ 2 నోటిఫికేషన్ వాయిదా వేసినట్లు తెలిసింది.

గ్రూప్​ 2 పోస్టులు

(నోట్​ : ఇటీవల అదనంగా చేర్చిన పోస్టులతో మొత్తం గ్రూప్ 2 ఖాళీలు 728 ఉన్నాయి. )

ఫారెస్ట్ బీట్​ ఆఫీసర్​ పోస్టులు

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!