Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్​ 1 పై టీఎస్​పీఎస్​సీ కీలక ప్రకటన.. కటాఫ్ మార్కులేం ఉండవు..

గ్రూప్​ 1 పై టీఎస్​పీఎస్​సీ కీలక ప్రకటన.. కటాఫ్ మార్కులేం ఉండవు..

గ్రూప్​ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్​ పూర్తి కావటంతో.. టీఎస్​పీఎస్​సీ (TSPSC) కీలక ప్రకటన జారీ చేసింది. ప్రిలిమ్స్​లో నిర్ణీత కటాప్​ మార్కులేం ఉండవని స్పష్టం చేసింది. జోన్ల వారీగా ఒక్కో కేటగిరీలో ఉన్న ఖాళీలను బట్టి.. ఒక్కో పోస్టుకు 1:50 చొప్పున మెయిన్స్​కు క్వాలిఫై అవుతారని స్పష్టం చేసింది. అందుకు సంబంధించి గతంలోనే జీవో నెం. 55 జారీ అయిందని ఈ ప్రకటనలో ప్రస్తావించింది. మొత్తం ఖాళీలను బట్టి చూస్తే.. యాభై రెట్ల మంది మెయిన్స్​కు క్వాలిఫై అవుతారని అందులో స్పష్టం చేసింది.

మెయిన్స్‌కు షాట్ లిస్ట్ చేయడానికి మాత్రమే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడం జరిగిందని టీఎస్​పీఎస్​సీ వెల్లడించింది. ప్రిలిమ్స్ పరీక్ష ఆధారంగా 1:50 మధ్య అభ్యర్థులను షార్ట్ లిస్ట్ జరుగుతుందని తెలిపింది. జోన్‌లలో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్ల ఆధారంగా నియామకాలు జరుగుతాయని పేర్కొంది. ఖాళీలను బట్టి ఒక్కో క్యాటగిరిలో ఒక్కో పోస్టుకు 1: 50 చొప్పున మెయిన్స్‌కి క్వాలిఫై చేస్తామని ప్రకటించింది.

టీఎస్​పీఎస్​సీ తాజా ప్రకటన ఇక్కడ అందుబాటులో ఉంది. ఇందకు సంబంధించిన పూర్తి వివరాలను గతంలోనే మెరుపులు.కామ్​ వివరించింది. అభ్యర్థులకు ఉపయోగపడే ఈ పోస్ట్ ను ఇక్కడ జత చేస్తున్నాం.

ప్రిలిమ్స్​ కటాఫ్ ఎంత.. ఎన్ని మార్కులు వస్తే మెయిన్స్​కు క్వాలిఫై అవుతారు..!

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!