Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్​ 2 ఎగ్జామ్​ డేట్​.. అధికారికంగా వెల్లడించిన టీఎస్​పీఎస్​సీ

గ్రూప్​ 2 ఎగ్జామ్​ డేట్​.. అధికారికంగా వెల్లడించిన టీఎస్​పీఎస్​సీ

గ్రూప్​ 2 ఎగ్జామ్ ఎప్పుడుంటుందని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అప్​డేట్ న్యూస్​​ వెలువడింది. టీఎస్​పీఎస్​సీ (TSPSC) గ్రూప్​ 2 (GROUP 2) పరీక్షల తేదీని ఖరారు చేసింది. ముందుగా వెల్లడించిన ప్రకారమే ఆగస్ట్​ నెలలోనే ఈ పరీక్ష నిర్వహించనుంది. ఆగస్ట్​ 29, 30 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్​పీఎస్​సీ ప్రకటన విడుదల చేసింది. వారం రోజుల ముందుగా హాల్​ టికెట్లను అఫిషియల్​ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచనుంది.

Advertisement

రాష్ట్రంలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. మొత్తం 5,51,901 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీ పడుతున్నారు. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులు భర్తీ చేసేందుకు టీఎస్​పీఎస్​సీ నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. అప్లికేషన్ల సంఖ్య పోస్టుల సంఖ్య ప్రకారం ఒక్కో పోస్టుకు సగటున 705 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం పోస్టుల్లో 44 శాతం.. అంటే 350 పోస్టులు మహిళలకే రిజర్వు అయ్యాయి. మొత్తం 600 మార్కులకు గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌లో 150 మల్టిపుల్‌ ఛాయిల్‌ ప్రశ్నలు ఉంటాయి. ఆగస్ట్ 29న రెండు పేపర్లు, ఆగస్ట్​ 30న రెండు పేపర్లు నిర్వహిస్తారు. ఒక్కో పరీక్షకు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!