తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ఫైనల్ ఎగ్జామ్ డేట్స్ ను తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయని ప్రకటించింది. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన తుది పరీక్ష ఏప్రిల్ 23న ఉంటుందని ప్రకటించింది. పలు ప్రత్యేక విభాగాలకు చెందిన పోస్టులుకు సంబంధించిన పరీక్షలు మార్చి 12 నుంచి ప్రారంభం అవుతాయని ప్రకటనలో పేర్కొంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్.
ఉదయం 10 నుంచి 1 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్ 2 ఉంటుందని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది. ఇంకా.. హాల్ టికెట్లు విడుదలకు సంబంధించిన తేదీని త్వరలో విడుదల చేస్తామని ప్రకటనలో పేర్కొంది. అప్డేట్స్ కోసం https://www.tslprb.in/ వెబ్ సైట్ ను సందర్శించాలని ప్రకటనలో పేర్కొన్నారు.