తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 26వ తేదీన పోలీస్ ట్రాన్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ (PTO)లో ఎస్ఐ ఉద్యోగాల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష (టెక్నికల్ పేపర్)ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని వెల్లడించింది. అభ్యర్థులు రేపు అంటే.. మార్చి 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 24వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు హాల్ టికెట్ పై సూచించిన ప్రదేశంలో పాస్ పోర్ట్ ఫొటోను అంటించాలని తెలిపింది.
లేనిపక్షలంలో అనుమతించబోమని స్పష్టం చేసింది. అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ కాకుండే support@tslprb.inకు మెయిల్ ద్వారా సమాచారం అందించాలని సూచించింది. లేదా 9393711110, 93910 05006 నంబర్లను సంప్రదించాలని తెలిపింది. ఇదే నియామకాలకు సంబంధించి తదుపరి నిర్వహించబోయే రెండు పరీక్షలకు హాల్ టికెట్లను వేర్వేరుగా జారీ చేస్తామని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.
హాల్ టికెట్లు విడుదలైన తర్వాత ఈ లింక్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంది.