HomeJOBSటీఎస్‌ఎల్‌పీఆర్‌బీ 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

త్వరలోనే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు విడుదల ప్రకటన

పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 7,437 ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, పోలీసు కానిస్టేబుళ్లతో పాటు ఫైర్‌, జైళ్లు, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగాల్లో సమాన స్థాయి పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు జులై 5న ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేయనుంది. హోం శాఖ ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖల అధిపతుల నుంచి ఖాళీల పూర్తి వివరాలు అందిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని బోర్డు వెల్లడించింది. లోకల్‌ క్యాడర్‌ వారీ ఖాళీలు, రోస్టర్‌ పాయింట్లు, విద్యార్హతలు వంటి వివరాలు అందిన తర్వాత పూర్తి షెడ్యూల్‌ ప్రకటించనుంది.

పోలీస్‌ శాఖలో 5 వేల పోస్టులు

పోలీస్‌ శాఖలోనే అత్యధికంగా 5 వేల ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో పోలీస్‌ కానిస్టేబుల్‌ సివిల్‌ పోస్టులు 3,697, కానిస్టేబుల్‌ ఏఆర్‌ పోస్టులు 1,052 ఉన్నాయి. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సివిల్‌ పోస్టులు 148, రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏఆర్‌ పోస్టులు 14, టీజీఎస్పీ పోస్టులు 12, ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌ పోస్టులు 3 భర్తీ కానున్నాయి. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎఫ్‌పీబీ పోస్టులు 23 ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్‌ ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌ 24, కానిస్టేబుల్‌ డ్రైవర్‌ పీటీఓ 20, కానిస్టేబుల్‌ మెకానిక్‌ పీటీఓ 7 పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఫైర్‌ శాఖలో 790 ఖాళీలు

ఫైర్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఎమర్జెన్సీ అండ్‌ సివిల్‌ డిఫెన్స్‌ శాఖలో 790 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. ఇందులో స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులు 39, ఫైర్‌ ఫైటర్‌ పోస్టులు 751 ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి అర్హతలు, ఎంపిక విధానం నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.

జైళ్ల శాఖలో 223 పోస్టులు

ప్రిజన్స్‌ అండ్‌ కరెక్షనల్‌ సర్వీసెస్‌ శాఖలో మొత్తం 223 ఖాళీలు భర్తీ చేయనున్నారు. డిప్యూటీ జైలర్‌ పురుషుల పోస్టులు 14, మహిళల పోస్టు 1 ఉంది. వార్డర్‌ పురుషుల పోస్టులు 196, వార్డర్‌ మహిళల పోస్టులు 12 భర్తీ చేయనున్నారు.స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో 1,424 పోస్టులుస్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో 1,424 ఖాళీలు భర్తీ కానున్నాయి. ఇందులో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 44, కానిస్టేబుల్‌ పోస్టులు 1,380 ఉన్నాయి. దీంతో పోలీస్‌, ఫైర్‌, జైళ్లు, ఎస్‌పీఎఫ్‌ విభాగాలు కలిపి మొత్తం 7,437 ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది.అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి.

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నోటిఫికేషన్లు కొన్ని రోజుల్లో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించినందున అభ్యర్థులు ఇప్పటి నుంచే సన్నద్ధతను వేగవంతం చేసుకోవాలి. పోస్టుల వారీ అర్హతలు, వయోపరిమితి, ఫిజికల్‌ టెస్టులు, రాత పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో ఉంటాయి. అభ్యర్థులు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలి. తప్పుడు ప్రచారం, అనధికారిక సమాచారం ఆధారంగా గందరగోళానికి గురికావద్దు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here