తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB).. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 198 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు 84 కాగా.. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు 114 ఉన్నాయి. పోస్టులను బట్టి విద్యార్హత నిర్ణయించారు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. డిసెంబర్ 30నుంచి జనవరి 20వ తేదీ వరకు అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు:
మొత్తం పోస్టులు- 198
ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST): 84 పోస్టులు
మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST): 114 పోస్టులు
2. విద్యార్హతలు (01-07-2025 నాటికి):
ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.
మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ: ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా BE/B.Tech/AMIE పూర్తి చేసి ఉండాలి.
3. వయస్సు (01-07-2025 నాటికి):
అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు కాగా.. గరిష్ట వయస్సు 25 ఏళ్లు ఉండాలి.( ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అదనంగా.. 12 ఏళ్ల సడలింపు ఉంటుంది అంటే 37 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు SC/ST/BC/EWS అభ్యర్థులకు.. మరో 5 ఏళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్ లకు సర్వీస్ కాలంతో పాటు అదనంగా 3 ఏళ్ల వయో సడలింపు వర్తిస్తుంది.
4. అప్లికేషన్ ఫీజు:
ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 800 చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు .. రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: డిసెంబర్ 30 నుంచి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: జనవరి 20, 2026 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.
1.ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in లోకి లాగిన్ అవ్వండి.
2. మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి (ఇదే మీ యూజర్ ఐడి).
3. నెట్ బ్యాంకింగ్/క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించండి.
4. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ,సంతకాన్ని స్కాన్ చేసి జేపీజీ (JPG) ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయండి.
5. అప్లికేషన్ పూర్తిగా నింపి సబ్మిట్ చేయండి.





