ఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్లకు హాజరవుతున్న అభ్యర్థులందరూ తప్పనిసరిగా పలు జాగ్రత్తలు పాటించాలని.. బోర్డు విధించిన నిబంధనలు తెలుసుకోవాలని తెలంగాణ పోలీస్ నియామక మండలి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (TSLPRB) స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో డిసెంబర్ 8వ తేదీ నుంచి ఈవెంట్స్ జరుగుతాయని ప్రారంభించనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ) / ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) కు దాదాపు 2.50 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. వీరందరూ ఈవెంట్స్‌కు అటెండయ్యే ముందు ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు..
1. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును వెంట తెచ్చుకోవాలి. అడ్మిట్ కార్డులు ఈనెల 29వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని A4 సైజు ప్రింటవుట్ తీసుకోవాలి.
2. పార్ట్ 2 అప్లై చేసినపుడు డౌన్లోడ్ చేసుకున్న పార్ట్ 2 దరఖాస్తు ఫారం ప్రింటవుట్ కాపీని వెంట తీసుకురావాలి. దీనిని అభ్యర్థి తన సంతకం చేయాలి.
4. కమ్యూనిటీ సర్టిఫికెట్.. అంటే క్యాస్ట్ సర్టిఫికెట్‌ను కంపల్సరీగా వెంట తీసుకురావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులందరూ కుల ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవటం తప్పనిసరి.
5. ఏజెన్సీ ఏరియాకు చెందిన వారు.. ఏజెన్సీ కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. ఇతర రిజర్వేషన్ అభ్యర్థులు రిజర్వేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్న వారు.. సర్వీస్ సర్టిఫికేట్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు.. నో డ్యూ సర్టిఫికేట్ అవసరం.
వీటిలో ఏ ఒక్క సర్టిఫికెట్ లేకున్నా.. అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తారు. అభ్యర్థులు తమకు నిర్ణయించిన టైమ్‌కు ఈవెంట్స్‌కు అటెండ్ కాకపోయినా..డిస్ క్వాలిఫై అయినట్లుగా పరిగణిస్తారు.

ఈవెంట్స్ నిర్వహణలోనూ ఈసారి అధికారులు స్వల్ప మార్పులు చేశారు. ముందుగా అభ్యర్థులకు రన్నింగ్ నిర్వహిస్తారు. నిర్ణీత సమయంలో రన్నింగ్ చేసిన వారందరి ఎత్తు కొలుస్తారు. నిర్ణీత ఎత్తు ఉన్న వారిని తదుపరి లాంగ్ జంప్, షాట్ పుట్ పోటీలకు అనుమతిస్తారు. ఎత్తులో ఒక సెంటీమీటర్ లోపు అనర్హులైన అభ్యర్థులు మరోసారి ఛాలెంజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అక్కడున్న చీఫ్ సూపరింటెండెంట్‌ను కలిసి అనుమతి కోరాలి.
అభ్యర్థులు తమ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకునే డైరెక్ట్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది
DIRECT LINK TO DOWNLOAD ADMIT CARD FOR SI, CONSTABLE EVENTS
(NOTE: 29న ఉదయం 8 గంటల నుంచి ఈ లింక్ యాక్టివేట్ అవుతుంది. డిసెంబర్ 3వ తేదీలోగా అభ్యర్థులు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలి)