తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) తాజాగా కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి అంటే.. జూన్ 06 నుంచి తమ దరఖాస్తులో దొర్లిన తప్పులను ఎడిట్ చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇందు కోసం అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 06 ఉదయం 08 గంటల నుంచి జూన్ 8 రాత్రి 08 గంటల వరకు ఎడిట్ చేసుకునేందకు అవకాశం కల్పించారు. ఎడిట్ చేసుకున్న తర్వాత ఆ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని.. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో చూపించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొంది.
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. రీకౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ కొరకు జూన్ 01 నుంచి జూన్ 03 వరకు అవకాశం కల్పించారు. అయితే.. దీనికి మొత్తం 1338 మంది దరఖాస్తు చేసుకున్నట్లు బోర్డు తెలిపింది. ఈ సంఖ్య మొత్తం అభ్యర్థులలో 1 శాతం కంటే తక్కువ అని వెల్లడించారు. ఈ అభ్యర్థుల యొక్క ఫలితాలను జూన్ 06వ తేదీన వెల్లడించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా మార్కులను తెలుసుకోవచ్చని వెబ్ నోట్లో తెలియజేశారు. ఇంకా జూన్ 6వ తేదీ నుంచి తమ దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే.. సరి చేసుకునేందుకు అవకాశం కల్పించారు.