రేపటి నుంచి పోలీస్ నియామకాలకు (Telangana Police Jobs) సంబంధించిన ఈవెంట్స్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈవెంట్స్ కు హాజరయ్యే అభ్యర్థులు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. TSLPRB ఇప్పటికే ఈవెంట్లకు సంబంధించిన నిబంధనలను విడుదల చేసింది.
- అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు/ఇంటిమేషన్ లెటర్ ను A4 సైజ్ పేజీకి రెండు వైపులా ప్రింట్ తీసుకుని రావాలని అధికారులు స్పష్టం చేశారు.
- అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ లో పేర్కొన్న సమయంలోగా గ్రౌండ్ కు రావాలని అధికారులు సూచించారు. ఆలస్యం అయితే.. వారి అభ్యర్థిత్వం రద్దు అవుతుందని తెలిపారు.
- అభ్యర్థులు ఎలాంటి వస్తువులను వెంట తీసుకురావొద్దని స్పష్టం చేశారు. గ్రౌండ్లో సమాను భద్రపరుచుకునే ఎలాంటి సదుపాయం ఉండదని తెలిపారు.
- ముఖ్యంగా మహిళా అభ్యర్థులు నగలు, హ్యండ్ బ్యాగ్ లు వెంట తీసుకురావొద్దని తెలిపారు. ఇంకా చేతికి మెహిందీ, టాటూలు వేసుకురావొద్దని సూచించారు.
-ఇంకా.. గ్రౌండ్ లోకి సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావొద్దని స్పష్టం చేశారు.
-ఇంకా పార్ట్-2 దరఖాస్తు ప్రింట్ అవుట్ ను తీసుకుని దానిపై అభ్యర్థి సంతకం చేసి వెంట తీసుకురావాలని సూచించారు.
-కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అభ్యర్థులు సంబంధిత పత్రాల జిరాక్స్ కాపీలపై సంతకం చేసి వెంట తీసుకురావాలన్నారు.
-ఇంకా ఎవరైనా డబ్బులు ఇస్తే ఈవెంట్స్ క్వాలిఫై చేయిస్తామని.. ఉద్యోగం ఇప్పిస్తామని చెబితే నమ్మి మోసపోవద్దని అధికారులు అభ్యర్థులకు సూచించారు.