తెలంగాణలో పోలీస్ నియామకాలకు (TS Police Jobs) సంబంధించి ఎస్సై, కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులపై TSLPRB తాజాగా కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 8, 2022 నుంచి PMT, PET టెస్టులు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. మొత్తం 11 కేంద్రాల్లో ఈవెంట్స్ ఉంటాయని తెలిపింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్.
23-25 రోజుల్లో అంటే జనవరి లోపు ఈ ప్రక్రియ పూర్తి కానుంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఆయా తేదీల్లో తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్లు విడుదలైన తర్వాత అభ్యర్థులు https://www.tslprb.in/ లింక్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది