తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2025 ప్రాథమిక కీ విడుదలైంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ (tgtet.aptonline.in/)లో సమాధానాలను సరిచూసుకోవచ్చు.ప్రాథమిక కీ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 8వ తేదీలోపు తెలియజేయాలని టెట్ అధికారులు వెల్లడించారు.
జూన్ 18 నుంచి 30 వరకు తొమ్మిది రోజుల పాటు మొత్తం.. 16 సెషన్లలో టెట్ పరీక్షలు పలు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పేపర్-1కు 74.65 శాతం మంది, పేపర్-2 (మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 73.48 శాతం మంది, అంతే కాకుండా పేపర్-2 (సోషల్ స్టడీస్)కు 76.23 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు.
ప్రాథమిక కీని పరిశీలించి.. అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఇదిలా ఉంటే.. ఫైనల్ కీ, ఫలితాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
రెస్పాన్స్ షీట్ ఎలా చెక్ చేసుకోవాలి ?
- ముందుగా అధికారిక వెబ్ సైట్ (tgtet.aptonline.in/)లోకి లాగిన్ అవ్వండి.
2.హోమ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని తర్వాత response sheet పై క్లిక్ చేయండి. - జనరల్ నంబర్, హాల్ టికెట్ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ, పేపర్‌కు సంబంధించిన వివరాలను ఎంటర్ చేసుకోండి.
- స్క్రీన్ పై రెస్పాన్స్ షీట్ డిస్ ప్లై అవుతుంది. ప్రింట్ తీసుకోండి.
టెట్ ప్రిలిమినరీ కీ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి ?
- ముందుగా అధికారిక వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వండి.
- హోం పేజ్‌లో కనిపించే Intial key పై క్లిక్ చేయండి.
- Intial key download క్రింద కనిపించే ఆప్షన్స్‌లో మీరు పేపర్ రాసిన తేదీ, సెషన్‌ను సెలక్ట్ చేసుకుని క్లిక్ చేయండి.
- కీ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.