తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ జూన్ 12న నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సుమారు 3.8లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. అయితే టెట్ హాల్ టికెట్లను జూన్ 6వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఇందుకు వెబ్సైట్లో ఆప్షన్ పెడతామని ఎస్ఈఆర్టీ అధికారులు తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో పేపర్–1 కోసం 1,480, పేపర్–2కు 1,171 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు యచేసినట్టు అధికారులు వివరించారు.
అత్యధికంగా హైదరాబాద్‌లో పరీక్షా సెంటర్లను ఏర్పాటు చేశామని దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ సంబంధించిన లొకేషన్‌ను ముందురోజే పరిశీలించుకోవాలని సూచించారు. ఆలస్యంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులకు పక్క జిల్లాల్లో సెంటర్ కేటాయించి నందున వారు కూడా వీలైనంత మేరకు ఎగ్జామ్ సెంటర్ వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలి. పరీక్షకు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన లోపలికి అనుమతించరు కాబట్టి అభ్యర్థులు సకాలంలో ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలి.
టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి..
టీఎస్ టెట్ హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి www.tstet.cgg.gov.in వెబ్సైట్ సంప్రదించాలి. జూన్ 6వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, లేదా ఫీజు పేమెంట్ చేసిన రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేది, మొబైల్ నంబర్ ఎంట్రీ చేసి హాల్ టికెట్‌ను డౌన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను అభ్యర్థులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలి.
Thank you🙏🙏🙏🙏