తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలై ఇప్పటికే 45 రోజులు గడిచింది. అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం మరో 30 రోజుల సమయం ఉంది. జూన్ 12న సుమారు 3.5లక్షల మంది అభ్యర్థులు టెట్ పరీక్షను రాయబోతున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రిపరేషన్లో ఉన్నారు. కొందరు సిలబస్ రివిజన్ చేస్తున్నారు. ఉద్యోగాలు ఇతర పనుల వల్ల మరికొంత మంది ఇంకా ప్రిపరేషన్ మొదట్లోనే ఉన్నారు. అయితే ఇలా వివిధ స్థాయి ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులకు ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఏ సబ్జెక్టులపై ఫోకస్ పెట్టాలి? ఎలా సన్నద్ధమవ్వాలని నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనలను మీకోసం అందిస్తున్నాం…
- టెట్ ప్రిపేరవుతున్న అభ్యర్థులందరికీ ఈ 30 రోజులు చాలా కీలకం. ఈ సమయాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకున్నవాళ్లే మంచి స్కోర్ సాధించేందుకు అవకాశం ఉంది. కనీసం 12 నుంచి15 గంటల పాటు ప్రిపరేషన్ కొనసాగించాల్సిందే. ఉదయం నోట్స్ చదువుతూ నైట్ టైమ్‌లో మోడల్ పేపర్లు, సబ్జెక్ట్వైస్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి.
- టెట్ పేపర్–1, పేపర్–2 సంబంధించి అభ్యర్థులందరికీ తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ సబ్జెక్టులు చాలా కీలకం. వీటి వెయిటేజి 90 మార్కులు కాబట్టి ఇప్పుడున్న సమయంలో అభ్యర్థులు ఈ సబ్జెక్టుల్లో గరిష్ట మార్కులు సాధించేందుకు దృష్టి సారించాలి. మిగిలిన 60 మార్కులు కంటెంట్‌కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి కాబట్టి వాటిని జవాబులు గుర్తించడం కష్టమేమి కాదు. ఇప్పటి వరకు ప్రిపరేషన్ ప్రారంభించని వారు కూడా కన్ఫ్యూజన్ కాకుండా తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీపై దృష్టి పెడితే ఎక్కువ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది.
- ఇది వరకే సైకాలజీ చదవడం పూర్తి చేసిన అభ్యర్థులు చివరి సమయంలో రివిజన్ చేయడం తప్పనిసరి. చదివేటప్పుడు సబ్జెక్టు ఈజీగానే, అన్ని తెలిసిన విషయాలనే భావన కలుగుతుంది. కానీ జవాబులు గుర్తించేటప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్కు గురవుతుంటారు. కాబట్టి రివిజన్తో పాటు మోడల్ ప్రశ్నలు ప్రాక్టీస్ తప్పనిసరి అవసరం. శిశువికాసం, అభ్యసనం, పెడగాగిలో అభ్యసనం టాపిక్ చాలా ఇంపార్టెంట్. గత ప్రశ్నాపత్రాలను గమనిస్తే వీటి నుంచే 10 నుంచి 15 ప్రశ్నలు అడిగారు కాబట్టి అభ్యసనంపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
- తెలుగులో పాఠ్యపుస్తకాల్లో కంటెంట్‌తో పాటు వ్యాకరణాంశాలను చూసుకోవాలి. ప్రతి టాపిక్ నుంచి గతంలో వచ్చిన ప్రశ్నలు, మోడల్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. కవులు వారి రచనలు, బిరుదులు, అవార్డులు, తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర ఇలాంటి అంశాలను అన్వయించి చదవాల్సి ఉంటుంది. ఆధునిక కవుల రచనలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అపరిత గద్యం, అపరిచిత పద్యం నుంచే 10 ప్రశ్నలుంటాయి. కాబట్టి పాఠ్యపుస్తకాల్లో ఉన్న పద్యాలను ఒకచదివి వాటి సారాంశాలను గుర్తు పెట్టుకోవాలి. కఠినమైన పదాల అర్థాలను ఒక పేజీలో రాసుకుని పరీక్షకు ముందు రోజు చదువుకుంటే ఉపయోగముంటుంది.
- మెథడాలజీ నుంచి 12 మార్కులకు ఉంటుంది.ఇది టెట్‌తోపాటు త్వరలో నిర్వహించే డీఎస్సీకి ఉపయోపడుతుంది. లాంగ్వేజెస్‌తో పాటు ఆప్షనల్ సబ్జెక్టుల మెథడాలజీలో బోధనా లక్ష్యాలు, బోధనా పద్ధతులు, మూల్యాంకనం, బోధనా వనరులు ఈ నాలుగు టాపిక్‌లను చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. మ్యాథ్స్, సోషల్, సైన్స్ సబ్జెక్టులను కలిపి ట్రై మెథడ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఉపయోగముంటుంది.
- ఇప్పటికే సిలబస్ చదవడం పూర్తి చేసి రివిజన్లో ఉన్న అభ్యర్థులు గతంలో నిర్వహించిన టెట్ ప్రశ్నాపత్రాలను గమనించాలి. అందులో అడిగిన ప్రశ్నల తీరును విశ్లేషించుకోవాలి. ప్రశ్నల స్థాయి ఎలా ఉంది. ఏ ఏ అంశాలను ఎక్కువగా అడిగారు? ప్రశ్నల కాఠిన్యత ఎంత? అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు చదివిన అంశాల్లో మిస్సైన టాపిక్స్ గుర్తించాలి. 2011 నుంచి 2016 వరకు నిర్వహించిన టెట్ల ప్రశ్నాపత్రాలు www.merupulu.com వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
- మే నెలాఖరు వరకు ప్రిపరేషన్ మొత్తం పూర్తి చేసి జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు గ్రాండ్ టెస్టులు అటెండ్ అవ్వాలి. ‘మెరుపులు’ www.merupulu.com వెబ్సైట్లో అన్నిసబ్జెక్టులకు సంబంధించిన డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు మొత్తం ఇప్పటికే 100 టెస్టులు అందుబాటులో ఉన్నాయి. సబ్జెక్టు నిపుణుల తయారు చేసిన స్టాండర్డ్ బిట్స్‌తో పాటు గత టెట్లలో వచ్చిన ప్రశ్నల సమాహారంతో ప్రాక్టీస్ టెస్ట్‌లను తయారు చేశాం. వీటన్నింటిని అభ్యర్థులు ప్రాక్టీస్ చేయగలిగితే అభ్యర్థులు 100కు పైగా మార్కులు సాధించే అవకాశం ఉంది.
- ‘మెరుపులు’ www.merupulu.com వెబ్సైట్లో 25 ప్రశ్నలతో డైలీ ప్రాక్టీస్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. 100 ప్రశ్నలతో వీక్లీ గ్రాండ్ టెస్టులు ఉచితంగానే అందించాం. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు తెలుగు కంటెంట్ సంబంధించి 20 టెస్టులు, తెలుగు మెథడాలజీ 10 టెస్టులు, ఇంగ్లీష్ మెథడాలజీ 10 టెస్టులు, మ్యాథ్స్ 20 టెస్టులు, సైకాలజీ శిశువికాసం, అభ్యసనం, పెడగాగి సంబంధించి 21 టెస్టులు, ట్రైమెథడ్స్ 10 టెస్టులు, బయాలజీ, సోషల్ స్టడీస్ 10 టెస్టుల లింక్‌లు ఈ పోస్టుతో పాటు అందిస్తున్నాం. వీటితో పాటు ప్రతి ఆదివారం నిర్వహించిన 5 గ్రాండ్ టెస్టులు కూడా ఉన్నాయి. టెట్ పరీక్ష నిర్వహించే రోజు జూన్ 12 వరకు ఈ టెస్టులు ప్రతి రోజు కొనసాగుతూనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్…
(click for previous tests ) TSTET WEEKLY GRAND TESTS | |
---|---|
Weekly Grand Test 1 | Weekly Grand Test 2 |
Weekly Grand Test 3 | Weekly Grand Test 4 |
Weekly Grand Test 5 |
Hiii sir I’m preparing for TET English medium then send me English medium practice bite,s please…
Sir
Can u send English medium bites for me sir …🙏🙏
Good Evening Mam/Sir,
I’m preparing for TET English Medium .
Requesting you to forward me the bits in English Medium also.
Please respond to my request as soon as possible.
Thanks Mam/Sir.
🙏🙏🙏🙏🙏
Good morning to all
Good morning sir
Please post practice test papers for English medium TET exams
Sir please consider our request for English medium
Because from anywhere I’m not getting practice bits
For Tet English medium
Plz plz plz,plz plz plz plz
Do the needful thing
This is my sensior request
Thank you