మే 17 నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కుల కేటాయింపు విషయంలో బోర్డు తదుపరి నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించింది. ప్రత్యేక అబ్జక్టివ్ విధానంలో మార్కులు కేటాయిస్తుందని.. ఈ విధానాన్ని నిర్ణయించే బాధ్యతను బోర్డుకు అప్పగించింది. బోర్డు కేటాయించిన మార్కులపై అభ్యంతరాలుంటే.. అభ్యంతరం వ్యక్తం చేసే విద్యార్థులకు పరీక్ష రాసేందకు ఛాన్స్ ఇస్తామని వెల్లడించింది. కరోనా దృష్ట్యా తదుపరి అనుకూల పరిస్థితులను బట్టి ఈ పరీక్ష ఉంటుందని స్పష్టం చేస్తుంది.
Advertisement
