రాష్ట్రంలోని నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఫ్రీ కోచింగ్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, గ్రూప్1, బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి తెలంగాణ స్డడీ సర్కిల్ ఫ్రీ కోచింగ్ ఇవ్వనుంది. శిక్షణ తీసుకునేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 28 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం www.studycircle.cgg.gov.in వెబ్సైట్ సంప్రదించవచ్చు.
ఎన్‌టీపీసీలో అసిస్టెంట్ లా ఆఫీసర్ ఉద్యోగాలు
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) అసిస్టెంట్ లా ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 10
జీతం: నెలకి రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు చెల్లిస్తారు.
అర్హత: లా డిగ్రీ ఉత్తీర్ణత. నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్టియం నిర్వహించే క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 2021) పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం పరీక్షకి హాజరై ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: క్లాట్ 2021 పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములో సాధించిన మెరిట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్స్ ప్రారంభం: 24 డిసెంబర్ 2021.
చివరి తేది: 7 జనవరి 2022
వెబ్సైట్: www.ntpc.co.in