తెలంగాణ పాఠశాలల అకడమిక్ కేలెండర్ విడుదలైంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10 తరగతులకు స్కూళ్లలోనే క్లాసులు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు మే 17 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయి. గతంలో ఉన్న 11 పేపర్లకు బదులుగా టెన్త్ విద్యార్థులకు ఈసారి కేవలం ఆరు పేపర్లు ఉంటాయి. మే 26 వ తేదీ లాస్ట్ వర్కింగ్ డే. మే నెల 27 వ తేదీ నుంచి జూన్ 13 వ తేదీ వరకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. ఈ ఏడాది కరోనా ప్రభావంతో విద్యా సంవత్సరం డిస్ట్రబ్ కావటంతో ఈసారి వేసవి సెలవులు 40 రోజుల నుంచి 16 రోజులకే కుదించారు.
Advertisement





Advertisement