తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TS SET 2023) అక్టోబర్ 28 నుంచి జరగనుంది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రి కాలేజీల లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 29వ తేదీన ముగిసింది. ఈ పరీక్షను అక్టోబర్ 28,29,30వ తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 40838మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇక పేపర్ 1 పరీక్ష 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2 పరీక్ష 100 ప్రశ్నలకు 3వందల మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష మూడు గంటలపాటు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్టు పద్దతిలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం http://telanganaset.org/వెబ్ సైట్ ను చూడవచ్చు.