రాష్ట్రంలోని పాఠశాలలన్నింటా సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 27 నుంచి గవర్నమెంట్ టీచర్లందరూ బడులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. టీవీ, టీశాట్, వివిధ డిజిటల్ పద్ధతులను అనుసరించి.. విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు సిద్ధం కావాలని ఈ ఉత్తర్వుల్లో సూచించింది.
Advertisement
