హైదరాబాద్, వరంగల్ లోని టీఎస్ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో పలు ట్రేడ్ లలో ప్రవేశాలకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను కోరుతోంది. దరఖాస్తుకు జూన్ 10 చివరి తేదీ. జూన్ 10వ తేదీ లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. https://iti.telangana.gov.in/వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మోటార్ మెకానిక్ వెహికల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్ లలో ప్రవేశాలు జరుగుతున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ట్రేడ్ లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్ ఆర్టీసీ డీపోల్లో అప్రెంటిస్ షిప్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు హైదరాబాద్ ఐటీఐ కాలేజీ ఫోన్ నెంబర్ 9100664452, 040 23450033, వరంగల్ కాలేజీ ఫోన్ నెంబర్లు 8949425319, 8008136611 ను సంప్రదించవచ్చు. పూర్తి వివరాలు https://iti.telangana.gov.in/ వెబ్ సైట్లో చూడవచ్చని సంస్థ పేర్కొంది.