ఈ POLYCET-2022 ర్యాంకు కార్డులను https://polycet.sbtet.telangana.gov.in https://polycetts.nic.in, or www.sbtet.telangana.gov.in, అనే వెబ్ సైట్ల ద్వారా పొందవచ్చును.
స్కాన్ చేయబడిన ఓ.ఎం.ఆర్.జవాబు పత్రాన్నిhttps://polycet.sbtet.telangana.gov.in https://polycetts.nic.in వెబ్ సైట్ ద్వారా ఆభ్యర్ధి పరీశీలన కొరకు పొందుపరిచబడినది. వార్త పత్రికల యందు ప్రచురించిన ప్రకటననే Call Letter గా భావించి విద్యార్ధులు కౌన్సిలింగ్ ప్రక్రియకు హాజరు కావలెనని తెలియపరచడమైనది. అభ్యర్ధులకు సర్టిఫికేట్ పరిశీలనకు సంబంధించి గాని వెబ్ కౌన్సిలింగ్ కు సంబందించి గాని మరే ఇతర ప్రత్యేక Call Letter పంపబడదు. వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాని ఆభ్యర్ధులు 2022-23 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ ( రాష్ట్ర సాకేతిక విద్యామండలి అనుబంధ కళాశాల) లొ ప్రవేశానికి అర్హులుగా పరిగణింపబడతారని తెలియజేయడమైనది.
సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి నిర్వహించిన POLYCET-2022 ప్రవేశ పరీక్ష ఫలితాలను గౌరవనీయులు శ్రీ నవీన్ మిట్టల్ IAS గారు తేది. 13-07-2022 నాడు విడుదల చేశారని తెలియజేయడమైనది. తేది. 30-06-2022 నాడు నిర్వహించిన POLYCET-2022 ప్రవేశ పరీక్షకు నమోదు చేసుకున్న 1,13,979 అభ్యర్ధులకు గాను 1,04,362 అభ్యర్ధులు హాజరైనారు. వీరిలో 75.73 శాతం అనగా 79038 అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించారు. హాజరైన 56392 బాలురకు గాను 40669 మంది అనగా 72.12 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇదే విధంగా హజరైన 47970 బాలికలకు గాను 38369 మంది అనగా 79.99 శాతం ఉత్తీర్ణత సాధించారు. MPC మరియు MBiPC ఉత్తీర్ణ శాతాన్ని క్రింది పట్టికలో చూపబడినది. POLYCET-2022 లో అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించుటకు 120 మార్కులకు గాను నిర్ణీత 30 శాతం అనగా 36 మార్కులు పొందవలెను. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్ధులకు నిర్ణీత ఉత్తీర్ణతకు 01 మార్కు పొందవలెను. POLYCET-2022 లో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా అభ్యర్ధులకు మెరిట్ ర్యాంకులు ఇవ్వడం జరిగింది.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ (PJTSAU) అందించే వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం మరియు కౌన్సెలింగ్ కోసం ప్రత్యేక ప్రవేశ నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది మరియు ప్రాస్పెక్టస్, సీటు స్థానం, పాలిటెక్నిక్‌ల జాబితా మరియు ఫీజు వివరములు మొదలైనవి విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.pjtsau.edu.in లో పొందుపరచబడును.
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (SKLTSHU) అందించే వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం మరియు కౌన్సెలింగ్ కోసం ప్రత్యేక ప్రవేశ నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది మరియు ప్రాస్పెక్టస్, సీటు స్థానం, పాలిటెక్నిక్‌ల జాబితా మరియు ఫీజు వివరములు మొదలైనవి విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ http://skltshu.ac.in/ లో పొందుపరచబడును.
పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీ (PVNRTVU) అందించే వివిధ డిప్లొమా కోర్సులలో ప్రవేశం మరియు కౌన్సెలింగ్ కోసం ప్రత్యేక ప్రవేశ నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది మరియు ప్రాస్పెక్టస్, సీటు స్థానం, పాలిటెక్నిక్స్ జాబితా మరియు ఫీజు మొదలైనవి విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.tsvu.nic.in లో పొందుపరచబడును. 2022-23 విద్యా సంవత్సరానికి తెలుగు మీడియంలో పశుసంవర్ధక మరియు మత్స్య పాలిటెక్నిక్‌ను (Animal Husbandry and Fisheries Polytechnic) అందిస్తుంది.
1Abhishek