తెలంగాణా పాలిటెక్నిక్ కాలేజీల్లో చేరేందుకు నిర్వహించే పాలీసెట్ ఎంట్రన్స్-2021 షెడ్యూల్ విడుదల అయింది. ఇంజనీరింగ్, వ్యవసాయ అనుబంధ డిప్లమా కోర్సుల్లో అడ్మిషన్లు ఈ ఎంట్రన్స్‌లో మెరిట్ ఆధారంగానే చేపడుతారు. జూన్ 12 వ తేదీ న ఎంట్రన్స్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి ప్రకటించింది. ప్రస్తుతం టెన్త్ చదువుతున్న విద్యార్థులు.. ఇప్పటికే టెన్త్ పాసైన విద్యార్థులు ఈ ఎంట్రన్స్ రాసేందుకు అర్హులే. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తి చేస్తే .. ఈసెట్ ఎంట్రన్స్ ద్వారా నేరుగా ఇంజనీరింగ్ సెకండియర్ లో చేరే ఛాన్స్ ఉంటుంది. పూర్తి వివరాల నోట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకొండి.
