HomeFeaturedPOLYCET9న పాలీసెట్​ రిజల్ట్స్​: 12 నుంచి అడ్మిషన్ ప్రాసెస్​

9న పాలీసెట్​ రిజల్ట్స్​: 12 నుంచి అడ్మిషన్ ప్రాసెస్​

ఈనెల 2న తేదీన జరిగిన పాలిసెట్ –2020 ఎగ్జామ్ రిజల్ట్ సెప్టెంబర్​ 9న విడుదల కానున్నాయి. ఈసారి 56,814 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటికే రిజల్ట్​ప్రాసెస్ దాదాపు పూర్తయింది. రెండు రోజుల కిందటే ఫైనల్​ కీ రిలీజ్​ చేశారు. రిజల్ట్ కు రెండు రోజుల ముందే అడ్మిషన్లకు సంబంధించిన షెడ్యూలను అధికారులు విడుదల చేశారు.

స్టేట్లో పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా, నాన్ డిప్లొమా కోర్సుల్లో మొత్తం 30,760 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సర్కారు పాలిటెక్నిక్ కాలేజీల్లో 11,980 ఉండగా, ప్రైవేటు కాలేజీల్లో 18,780 సీట్లున్నాయి. వీటితో పాటు మరో 870 సీట్లు అగ్రికల్చర్ విభాగంలో అందుబాటులో ఉన్నాయి.

FIRST PHASE

  • ఈ నెల 12 నుంచి ఫస్ట్ ఫేజ్, 30 నుంచి సెకండ్ ఫేజ్​అడ్మిషన్ల ప్రాసెస్ ప్రారంభిస్తారు.
  • విద్యార్థులు సర్టిఫికేట్ల పరిశీలన కోసం ఈనెల12 నుంచి17 వరకు ఆన్​లైన్ లో స్లాట్ బుక్​చేసుకోవాలి.
  • స్లాట్ బుక్ చేసుకున్న వారి సర్టిఫికేట్ల పరిశీలన ఈనెల14 నుంచి18 వరకు కొనసాగుతోంది.
  • సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిన వారు ఈనెల14 నుంచి20 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి.
  • వారికి ఈనెల 22న సీట్ల కేటాయింపు ఉంటుంది.
  • సీట్లు పొందిన అభ్యర్థులు 22 నుంచి 26 వరకు సెల్ఫ్​రిపోర్ట్ చేయాల్సి ఉంది.

SECOND PHASE

  • ఈనెల 30 నుంచి రెండో విడుత అడ్మిషన్​ కౌన్సిలింగ్ ప్రారంభం.
  • ఈ నెల30 నుంచి అక్టోబర్ 1 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి.
  • అక్టోబర్ 3న సీట్లు కేటాయిస్తారు.
  • అక్టోబర్ 5, 6 తేదీల్లో సీటు అలాటైన కాలేజీల్లో రిపోర్టు చేయాలి.

ప్రైవేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల కోసం అక్టోబర్ 8న అధికారులు గైడ్ లైన్స్​ జారీచేయనున్నారు.

వచ్చేనెల 7 నుంచి విద్యాసంవత్సరం మొదలవుతుంది. అక్టోబర్ 15 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి.

TSPOLYCET 2020 OFFICIAL FINAL KEY DOWNLOAD HERE

Latest Posts

MODEL PAPERS

PRACTICE PAPERS

STUDY MATERIAL