తెలంగాణ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ, ఇంటర్ ఎగ్జామ్స్ జులై లో జరుగనున్నాయి. ఎగ్జామ్ తేదీలను త్వరలో ప్రకటించనుంది. అభ్యర్థులందరూ ఈనెల 19 నుంచి మే 10 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ శుక్రవారం ప్రకటన జారీ చేసింది. నిర్ణీత గడువులో చెల్లించకపోతే.. ఫైన్‌తో మే 24 వరకు చెల్లించే ఛాన్స్ ఉంటుంది. టీఎస్ ఆన్లైన్ లేదా మీ సేవా సెంటర్ల ద్వారా ఫీజులు చెల్లించాలని పేర్కొంది.
Advertisement
