తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ఖాళీల భర్తీకి షెడ్యూలు విడుదలైంది. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో 2022–23 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలతో పాటు 7, 8, 9, 10 వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాగానే.. జూన్ ఒకటో తేదీ నుంచి అన్ని తరగతులకు క్లాసులు ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన ప్రకటించారు.
దరఖాస్తుల గడువు; విద్యార్థులు ఫిబ్రవరి 08 నుంచి మార్చి 04 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కోటా అభ్యర్థులు రూ.150, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ విద్యార్థుల రూ.75 ఫీజు చెల్లించాలి.
ఎగ్జామ్ తేదీ, ఫలితాలు; ఏప్రిల్ 16, 17 తేదీల్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. మే 20 న ఫలితాలను ప్రకటించి ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 24న విడుదల చేస్తారు.

