ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూలును ఇంటర్ బోర్డు ప్రకటించింది. మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు మొదలవుతాయి. జేఈఈ పరీక్షల కారణంగా ఇప్పటికే రెండు సార్లు ఇంటర్ పరీక్షలను తేదీలను మార్చింది. ఇటీవల ఖరారైన జేఈఈ తేదీలకు అనుగుణంగా కొత్త షెడ్యూలును తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది.