తెలంగాణలో ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఉన్నతాధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు. 91.92 శాతం విద్యార్థులు ఐసెట్ లో అర్హత సాధించారు. దీంతో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 71,647 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు 2024 జూన్ 5,6 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 86,156 మంది అప్లై చేసుకోగా, 77,942 మంది ఎగ్జామ్కు అటెండ్ అయ్యారు. విద్యార్థులు హాల్‌టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాల్ని ఎంటర్ చేసి ర్యాంక్ కార్డుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఐసెట్ ఫలితాలు వచ్చేశాయ్
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS